మగాడిని మగాడే మోసం చేస్తే ? బెజవాడలో అరుదైన షాకింగ్ ఘటన...
విజయవాడలో ఓ అరుదైన షాకింగ్ ఘటన నమోదైంది. ఇప్పటివరకూ మహిళలను, యువతులను మగాళ్లు పెళ్లి పేరుతో మభ్యపెట్టడం, వాడుకుని వదిలేయడం, వాళ్ల దగ్గర నుంచి డబ్పులు కాజేయడం వంటి కేసుల్ని చూశాం. కానీ విజయవాడలో మాత్రం తాజాగా ఓ యువకుడు మరో యువకుడిని ప్రేమించడమే కాకుండా తనకోసం ట్రాన్స్ జెండర్ గా మార్చి, కోరికలన్నీ తీర్చుకుని ఆ తర్వాత బంగారం, డబ్బు కాజేసి మోసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
విజయవాడలో ఓ మగాడు మరో మగాడి చేతిలోమోసపోయాడు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా దీనిపైనే జనం చర్చించుకుంటున్నారు. సుమారు ఆరేళ్లుగా నగరంలో పవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు యువకులు సహజీవనం చేస్తున్నారు.ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా భావించారు. ఇందుకోసం పవన్ భ్రమరాంబికగా పేరు మార్చుకోవడంతో పాటు లింగ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఇందుకోసం 11 లక్షల రూపాయల ఖర్చు చేశాడు.

తన లవర్ నాగేశ్వరావుని నమ్మి అతనికి 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదు కూడా ఇచ్చాడు భ్రమరాంబికగా మారిన పవన్.2019 నుంచి కృష్ణలంక సత్యం గారి హోటల్ సెంటర్ సమీపంలోని ఒక ఇంటిలో నివాసం ఉన్న ఇరువురు...ట్యూషన్ పాయింట్ పెట్టుకుని సహజీవనం చేశారు. ఇంటి యజమానికి మగవారు గానే పరిచయం చేసుకున్న ఇద్దరూ అలాగే కలిసి ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో నాగేశ్వరరావు భ్రమరాంబికగా మారిన పవన్ తో పెళ్లికి నిరాకరించాడు. అంతే కాదు తనతో ఉండొద్దంటూ భ్రమరాంబిక ను గెంటేశాడు.
దీంతో తాను మోసపోయానని తెలుసుకొని భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగేశ్వరరావుతో పాటు ఇందుకు సహకరించిన అతని తల్లి విజయలక్ష్మి పై భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడంటూ నాగేశ్వరావు పై ట్రాంజెండర్ భ్రమరాంబిక ఫిర్యాదులో పేర్కొంది. ట్రాంజెండర్ ఈ నెల 10న చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. సెక్షన్ 406,420,34 ఐపీసీ కింద నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications