విజయవాడలో వాలంటీర్ల యూటర్న్..! మూకుమ్మడిగా తీర్మానం..
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటివరకూ అధికార వైసీపీకి మద్దతుగా ఉంటూ క్షేత్రస్ధాయిలో వారి అభ్యర్ధులకు ప్రచారం కూడా చేసిన వాలంటీర్ల ఘటనలు చూస్తుండగా.. ఇప్పుడు విజయవాడలో వారు యూటర్న్ తీసుకున్నారు. అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం కూడా చేశారు.
నిన్న విజయవాడలో జరిగిన వాలంటీర్ల సంఘం సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ వైసీపీకి అండగా ఉంటున్న వాలంటీర్లు ఇకపై టీడీపీకి మద్దతివ్వాలని నిర్ణయించారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు 50 వేలు ఆదాయం వచ్చేలా చూస్తానని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో వాలంటీర్ల సంఘ ప్రతినిధులంతా మూకుమ్మిగా టీడీపీవైపు మొగ్గారు.

చంద్రబాబు సీఎం అయితే పరిశ్రమలు వస్తాయని, తమ కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి టీడీపీ వెంటే వెళ్లాలని విజయవాడ వాలంటీర్లు తీర్మానించారు. ఇన్నాళ్లూ వైసీపీ కోసం పనిచేస్తే దక్కింది ఐదు వేలేనని, టీడీపీ అధికారంలోకి వస్తే తమతోపాటు కుటుంబాలు, రాష్ట్రం బాగుపడుతుందనే కారణాలతో వాలంటీర్లంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications