ఏపీలో నేడు రోళ్ళు పగిలే ఎండలు.. ఈ మండలాలలో తీవ్ర వడగాలులు; ప్రజలకు అలెర్ట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతలోనే ఎండ, ఆ పైన వర్షాలు అన్నట్టు ఏపీలో వాతావరణ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. నిన్నటి వరకు రెమాల్ తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం ఏపీలో నేటి నుంచి మళ్లీ ఎండలు దంచి కొడతాయి అని చెబుతున్నారు.

ఏపీలో మళ్ళీ భగ్గుమనేలా ఎండలు
సోమవారం నుంచి రాష్ట్రంలో ఎండ ప్రభావం చూపనుందని, అంతేకాదు వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనుందని ఏపీ బస్సులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ . నేడు 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మంగళవారం 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

In AP scorching sun today severe heat wave in these mandals alert to people

ఈ జిల్లాలకు వడగాలుల హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లాలో మూడు మండలాలలో,విజయనగరం జిల్లాలో 17 మండలాలలో, మన్యం జిల్లాలో 10 మండలాలలో ,అల్లూరి జిల్లాలో రెండు మండలాలలో,అనకాపల్లి జిల్లాలో రెండు మండలాలలో, కాకినాడ జిల్లాలో ఆరు మండలాలలో,కోనసీమ జిల్లాలో రెండు మండలాలలో, తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలలో, పశ్చిమగోదావరి జిల్లాలో మూడు మండలాలలో,ఏలూరు జిల్లాలో ఏడు మండలాలలో, కృష్ణా జిల్లాలు రెండు మండలాలలో,బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో, ఇలా అనేకచోట్ల నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
మొత్తం తీవ్రమైన వడగాలులు వీచే రెండువందల మండలాలకు సంబంధించిన లిస్టును, అక్కడ వాతావరణ పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఏపీ ప్రజలు ఈరోజు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మళ్లీ రోళ్లు పగిలే ఎండలు నమోదు కానున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వడగాలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలివే
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత, పల్నాడు జిల్లా నరసరావుపేలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత,తిరుపతి జిల్లా నాయుడుపేటలో40.6 డిగ్రీల ఉష్ణోగ్రత, కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు,నెల్లూరు జిల్లా మనుబోలులో 40.4 డిగ్రీలో ఉష్ణోగ్రత,ఏలూరు జిల్లా పెదవేగిలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+