• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో ఆ రెండు వ‌ర్గాల మ‌ద్య ఆంత్యర్యం..! ఏ పార్టీకి ప్ర‌మాదం..? ఏపార్టీకి ప్ర‌మోదం..!?

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఏపిలో రాజ‌కీయాలు రెండు సామాజిక వ‌ర్గాల ఐక‌మ‌త్యం మీద ఆధార‌ప‌డి న‌డుస్తుంటాయి. ఈ రెండు సామాజిక వ‌ర్గాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం రాజ‌కీయ‌పార్టీల‌కు క‌త్తి మీద సాములాంటిదే. ఐన‌ప్ప‌టికి చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించే రాజ‌కీయ పార్టీలు ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకుపోతూ ల‌బ్ది పొందుతుంటాయి. కాని ఈ సారి జ‌ర‌గ‌బోవు ఎన్నిక‌ల్లో ఈ రెండు వ‌ర్గాల ప్ర‌భావం అదికంగా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. క్రిష్ణ జిల్లాలో అదికంగా ఉండే ఈ ఆదిప‌త్య పోరు ఇప్పుడు ఏపి వ్యాప్తంగా విస్త‌రించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ఈ రెండు సామాజిక వ‌ర్గాల పోరు రాబోవు ఎన్నిక‌ల్లో ఏ రాజ‌కీయ పార్టీకి శ‌రాఘాతం కానుంది.? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

<strong>వైసీపీలో కొన‌సాగుతున్న చేరిక‌లు..! జాత‌రను త‌ల‌పిస్తున్న లోట‌స్ పాండ్..!! 16నుండి బ‌స్సు యాత్ర‌..!!</strong>వైసీపీలో కొన‌సాగుతున్న చేరిక‌లు..! జాత‌రను త‌ల‌పిస్తున్న లోట‌స్ పాండ్..!! 16నుండి బ‌స్సు యాత్ర‌..!!

ఏపి లో వ‌ర్గ రాజ‌కీయాలు..! ఏ పార్టీకి అండ‌గా ఉంటాయి..!

ఏపి లో వ‌ర్గ రాజ‌కీయాలు..! ఏ పార్టీకి అండ‌గా ఉంటాయి..!

ఏపి ఎన్నిక‌ల్లో ఈ సారి ఎమోష‌న్స్ తారాస్థాయికి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఊహ‌కు అంద‌ని విధంగా స‌మీక‌ర‌ణ‌లు, అంచ‌నాలు, రాజ‌కీయ‌పార్టీల‌ను ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. ఎవ‌రు ఎటువైపు ఉంటారు. ఎవ‌రు ఎవ‌రికి కొమ్ముకాస్తార‌నేది అంచ‌నా వేయ‌టం త‌ల‌కు మించిన భార‌మంటూ సీనియ‌ర్లు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వాస్త‌వానికి ఏపీలో కుల ప్ర‌భావం రాజ‌కీయాల్లో జ‌యాప‌జ‌యాల‌ను నిర్దేశిస్తుంద‌ని భావిస్తున్నారు రాజ‌కీయ నేత‌లు.

 కుల సంఘాల‌ను ఆశ్ర‌యిస్తున్న పార్టీలు..! ప్ర‌భావం చూపిస్తామంటున్న సంఘాల నేత‌లు..!!

కుల సంఘాల‌ను ఆశ్ర‌యిస్తున్న పార్టీలు..! ప్ర‌భావం చూపిస్తామంటున్న సంఘాల నేత‌లు..!!

కుల‌పార్టీలు అని చెప్ప‌క‌పోయినా, ఏదోఒక పార్టీను ఆయా కులాలు ఓన్ చేసుకుంటూనే ఉన్నారు. గెలిచి అధికారంలోకి వ‌చ్చిన స‌ద‌రు ప్ర‌భుత్వాలు, ఇది నిజ‌మ‌నేంత‌గా కులానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి కూడా. ఇప్పుడు ఏపీలో క‌మ్మ‌, కాపు, రెడ్డి ప్ర‌త్య‌క్షంగా మూడు కులాలు బ‌లాలు చాటుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ ఆప్యాయంగా క‌లిసిమెలిసి ఉన్న వారు, ప‌ల్లెల్లో ఒక్క‌సారి విడిపోయిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఓ కులం వారిని ప‌క్క కులం వారు శ‌త్రువు అనే భావ‌న‌తోనే చూస్తున్నట్టుచ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి బాట‌లు వేసిన పాపం మాత్రం రాజ‌కీయ పార్టీల‌దే. కానీ అవే రాజ‌కీయ పార్టీలు మాత్రం కుల‌బ‌లం ఉన్న‌చోట స‌ద‌రు వ‌ర్గ నేత‌ల‌కే ప్రాధాన్య‌మివ్వ‌డం విశేషం.

క్రిష్ణ, గుంటూరులో కీలకంగా మారిన కుల పోరు..! ఎవ‌రివైపు ఉంట‌ర‌నేదే ఉత్కంఠ‌..!!

క్రిష్ణ, గుంటూరులో కీలకంగా మారిన కుల పోరు..! ఎవ‌రివైపు ఉంట‌ర‌నేదే ఉత్కంఠ‌..!!

ఇక గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం మొన్న‌టి వ‌ర‌కూ కాపు వ‌ర్గానికి చెందిన కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడుని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దానికి త‌గిన‌ట్లుగా ఆయ‌న కూడా బ‌ల‌ప‌డుతూ ప‌ట్టు సంపాదించారు. కానీ.. చివ‌రి నిమిషంలో ఆ సీటును నంబూరి శంక‌ర్‌రావు అనే క‌మ్మ వ‌ర్గ నేత‌కు క‌ట్ట‌బెట్టారు. ఎందుకంటే.. అక్క‌డ టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ బ‌రిలో ఉన్నారు. కుల స‌మ‌తుల్య‌త కోసం ఇలా చేశామంటూ చెబుతున్నారు. గుడివాడ‌లో టీడీపీ కూడా కొడాలిని ఎదుర్కొనేందుకు దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపింది.

ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌నున్న క‌మ్మ‌, కాపు..! అదికారం క‌ట్ట‌బెట్ట‌డంలో కీల‌క పాత్ర వారిదే..!!

ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌నున్న క‌మ్మ‌, కాపు..! అదికారం క‌ట్ట‌బెట్ట‌డంలో కీల‌క పాత్ర వారిదే..!!

టీడీపీ, వైసీపీలు బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గాలైన క‌మ్మ‌, కాపు, రెడ్ల‌ను చీల్చి తాము లాభ‌ప‌డాల‌ని ఆశ‌ప‌డుతున్నాయి. ఈ మేర‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కూ తామంతా ఒక్క‌చోట‌నే ఉంటామ‌ని భావించే కులాల్లో చీలిక‌లు తెచ్చారు. తాయిలాలు, కార్పొరేష‌న్ ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్టుల‌ను ఎర‌వేసి వీలైనంత మందిని త‌మ‌వైపున‌కు మ‌ళ్లించుకుంటున్నాయి. నెల‌రోజుల వ‌ర‌కూ ఇది కొన‌సాగినా.. ఆ త‌రువాత గెలిచిన పార్టీ అధికారంలో.. ఓడిన పార్టీ త‌మ వ్యాపార వ్య‌వ‌హారాల్లో మునిగిపోతారు. మ‌రి.. పార్టీల కోసం కొట్టుకులాడిన కార్య‌క‌ర్త‌లు, అంతర్గ‌త త‌గాదాల‌తో ప‌ల్లెల్లో చిచ్చుపెడ‌తార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

English summary
In politics, politics is based on the unity of two social groups. Coordinating these two social groups and going to the polls is like a battle. for political parties. However, the political parties that are brilliant are benefiting from both the social classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X