సీఈసీ మరో సంచలనం-ఏపీలో ముగ్గురు కలెక్టర్లు, ఐజీ, ఐదుగురు ఎస్పీలపై బదిలీ వేటు..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలన ఆదేశాలు ప్రకటిస్తున్న ఈసీ ఇవాళ మరో సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఏకంగా ఓ ఐజీ, ఐదు జిల్లాల ఎస్పీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరందరినీ విపక్షాల ఫిర్యాదులతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన వారిలో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలు ఉన్నారు. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు పంపింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా పంపారు.

in big shocker to ysrcp ec transfers 5 district sps and 3 collectors in ap

ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ బదిలీ వేటు పడిన వారిలో చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ ఉన్నారు. వీరితో పాటు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు కూడా ఉన్నారు. రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు వేస్తున్నట్లు ఈసీ తెలిపింది.

మరోవైపు ఇవాళ మరో మూడు జిల్లాల కలెక్టర్లపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా జిల్లా -పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాపై బదిలీ వేటు పడింది. ఈ ముగ్గురిని తక్షణం బదిలీ చేయాలని సీఈవోకు ఆదేశాలు రావడంతో సీఎస్ కు తదుపరి ఉత్తర్వుల కోసం పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+