కరోనా టెర్రర్ లోనూ మందుబాబుల మహా తెలివి .. లిక్కర్ కోసం వైన్స్ ముందు అలా...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికే పరేషాన్ గా తయారయ్యింది .ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండున్నర లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఇక భారత్ లోనూ కరోనా ప్రభావం దారుణంగా మారింది. ఇప్పటికి 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం మన ప్రభుత్వాలకు టెన్షన్ గా మారింది. గత నెల రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని చెప్తున్నాయి.

వైన్స్ ముందు మందుబాబుల కరోనా జాగ్రత్తలు
అదలా ఉంటే కరోనా విలయ తాండవం చేస్తున్నా సరే మందుబాబులు లిక్కర్ మానటం లేదు . కానీ వైన్స్ ముందు మహా తెలివి చూపిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమూహాలుగా ఉంటె కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని భావించి ఇప్పటికే విద్యాసంస్థలు , థియేటర్లు , వేడులకు, విందులు , వినోదాలు అన్నీ బంద్ చెయ్యాలని పేర్కొంది. జన సమూహంలో ఉన్నప్పుడు కనీస దూరం ఉండేలా ఉంటే ఈ కరోనాకు చెక్ పెట్టొచ్చని.. ఎవరికి వారే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారినపడకుండా రక్షణ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

పద్దతిగా క్యూలో మందు కొనుగోలు చేస్తున్న మందుబాబులు
ఇందులో భాగంగా ఇప్పటికే స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు మూసివేశారు.ఇక మందుబాబులు కూడా ఎక్కువగా కలవకుండా బార్లు , రెస్టారెంట్లు మూసివెయ్యగా కేవలం వైన్స్ మాత్రమే తెరచి ఉన్నాయి . ఈ క్రమంలో చాలాచోట్ల లిక్కర్ షాపులు అటు బార్లు, రెస్టారెంట్లు లేక కిక్కిరిసిపోతాయని భావిస్తే అక్కడ మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు కిక్కిరిసిపోయే లిక్కర్ షాపుల ముందు ఇప్పుడు మందుబాబులు పద్దతిగా క్యూ కడుతున్నారు .
Recommended Video

నోటికి మాస్క్ లను ధరించి, కర్చీఫ్ కట్టుకుని మరీ జాగ్రత్తలు
ఒకరికి ఒకరు తాకకుండా నోటికి మాస్క్ లను ధరించి, కర్చీఫ్ కట్టుకుని మరీ ఎవరికీ తాకకుండా లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జన సమూహం ఎక్కువగా ఉండే దృష్ట్యా బార్లు తెరవకుండా మూసివెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక వైన్స్ దగ్గర కూడా జనం సమూహాలుగా ఉంటె లిక్కర్ షాపులు కూడా మూసివేస్తారని భావించిన మందుబాబులు బుద్ధివంతుల్లా ఒకరికి ఒకరు తాకకుండా లిక్కర్ కొనుగోలు చేస్తున్న తీరు వీరి మహా తెలివికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇలా చాలా రాష్ట్రాల్లో మందుబాబులు తగు జాగ్రత్తలు పాటిస్తూ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications