డిజిటలైజేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో అరుదైన అవార్డు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో అరుదైన అవార్డు లభించింది. డిజిటలైజేషన్ రంగంలో ఏపీ ప్రభుత్వం ప్రథమస్థానంలో లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో వివిధ కేటగిరీలకు గాను కేంద్రం గురువారం అవార్డులను ప్రకటించింది.
శుక్రవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏపీ ఐటీశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఈ అవార్డును అందుకోనున్నారు. కాగా, డిజిటలైజేషన్ రంగంలో అవార్డుని సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది.

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 18 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కె.సుధాకర్ - ఓఎస్డీ, గురజాల; ఎస్.కె.బాబు- ఓఎస్డీ, విజయవాడ సిటీ; రమణ - ఓఎస్డీ, విజయవాడ సిటీ; సుబ్బరాజు - డీఎస్పీ ఇంటెలిజెన్స్; ఎం.రాజారావు - డీఎస్పీ ఎస్‌బీ, విజయనగరంకు బదిలీ అయ్యారు.
కృష్ణ ప్రసన్న- ఓఎస్డీ, విజయనగరం; రాజగోపాల్ - ఓఎస్డీ, విజయవాడ సిటీ; విఠలేశ్వర్ - ఓఎస్డీ క్రైం, నెల్లూరు; రామాంజనేయులు రెడ్డి, ఓఎస్డీ, అనంతపురం; దేవానందం, ఓఎస్డీ అడ్మిన్, ప్రకాశం; సుకుమారి- డీఎస్పీ ఇంటెలిజెన్స్, వీరారెడ్డి- ఓఎస్డీ క్రైం, శ్రీకాకుళం; సుబ్బన్న - డీఎస్పీ, పీటీసీ, ఒంగోలు; నాగరాజు - డీఎస్పీ ఎస్ బీ, ప్రకాశం; సౌజన్య, కరీముల్లా షరీఫ్, వెంకటేశ్వర నాయక్, పోతురాజులను హెడ్ క్వార్టర్స్‌లో అటాచ్ చేశారు.












Click it and Unblock the Notifications