(పిక్చర్స్) ఏపీ సీఐడీ విచారణ: రైలు ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఐడీ విచారణకు ఆదేశించారు.

విజయనగరం: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఐడీ విచారణకు ఆదేశించారు.

ఈ ప్రమాదంలో నలభై మంది వరకు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. రైలు ప్రమాదంలో కుట్రకోణం దాగి ఉన్నట్లుగా అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉడటంతో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే వర్గాలు కూడా చెబుతున్నాయి.

ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్‌, రెండు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉన్నాయి.

ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు. దాదాపు 100 మందికిపైనే గాయాలపాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించారు.

తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

రైలు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా ప్రమాదాలు జరగడం శోచనీయమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. 39 మందికి పైగా మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

మమతా బెనర్జీ విచారం

మమతా బెనర్జీ విచారం

రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మమత తీవ్ర విమర్శనాస్త్రాలను సంధించారు.

భద్రతకు ప్రాధాన్యం ఏది

భద్రతకు ప్రాధాన్యం ఏది

రైల్వే శాఖ నిర్లక్ష్యం, ప్రయాణికుల భద్రతకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. రోజుకు కోట్లాది మంది ప్రజలు ప్రయాణించే రైల్వే వ్యవస్థ దేశానికి జీవన రేఖగా ఆమె అభివర్ణించారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు కృషిని తాము నిందించడంలేదని, ఇలాంటి అత్యవసర సమయాల్లో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

హాహాకారాలు

హాహాకారాలు

శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగిన సంఘటనతో ప్రయాణీకులు బిత్తరపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చాలామంది మృత్యువాత పడ్డారు. తమ వారు కోసం కొందరు వెతుకులాడారు. గాయాలపాలైన వారు హాహాకారాలు చేశారు.

బోగీలు నుజ్జునుజ్జు

బోగీలు నుజ్జునుజ్జు

బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు వాటిలో ఇరుక్కు పోయాయి. ఒకదానిపై ఒకటిగా పడిపోయి కనపడుతున్నాయి. సమాచారం తెలియగానే సహాయక బృందాలు వచ్చాయి.

సహాయక చర్యల్లో స్థానికులు

సహాయక చర్యల్లో స్థానికులు

రైలు ప్రమాద ఘటనతో విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నపాటి గాయాల పాలైన వారిని కూనేరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తరలింపు

ఆసుపత్రికి తరలింపు

రాయగఢ్‌, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పార్వతీపరం ఆసుపత్రికి 18 మందిని తీసుకురాగా అందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గీతాంజలి మహంతి, నీలిమ మిస్రో, భగవాన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

మాట్లాడిన సురేష్ ప్రభు

మాట్లాడిన సురేష్ ప్రభు

ఒడిశా పోలీసులతో మాట్లాడి మృతదేహాలను బంధువులకు త్వరగా అప్పజెప్పేందుకు ఏపీ డీజీపీ స్వయంగా సమన్వయ బాధ్యతలు చేపట్టారు. ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని వారిని కోరారు.

సహాయక బృందాలు

సహాయక బృందాలు

ఎనిమిదిప్రథమ చికిత్స బృందాలు, 4 పోస్టుమార్టం బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి. మృతదేహాలకు అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేశారు.

కుట్రకోణం

కుట్రకోణం

రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గూడ్స్ రైలు లేకుంటే...

గూడ్స్ రైలు లేకుంటే...

హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కూనేరు రైల్వేస్టేషన్‌కు తూర్పు కేబిన్‌ వద్ద పట్టాలు తప్పింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్సు రైలు ఆగిఉంది. రైలు ఒక్కసారిగా గూడ్సు రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ఘటనా ప్రాంతాన్ని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+