ఎన్నిసార్లు అడిగినా సాయం చేయటం లేదు: మోడీపై బాబు ఆగ్రహం

అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు సోమవారం ఉదయం అనంతపురం జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతలోని పీటీసీ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఏమాత్రం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో ఏపీకి కేంద్రం ఏమాత్రం సహకారం అందించలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేస్తామన్న హామీని కూడా కేంద్ర సర్కారు అమలు చేయలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చినా నిధులు రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ రెండేళ్లు గడిచినా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక లోటు భర్తీకి చిల్లిగవ్వ కూడా విదల్చలేదన్నారు. పోలవరంకు సరిపడ నిధులివ్వడంలో కేంద్రం ఆసక్తి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విభజన కష్టాలు రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు, ఆస్తుల పంపకాల్లో వ్యత్యాసం ఉందన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాను కోరుతున్నానని చెప్పారు. సోనియా పుట్టిన రోజున విభజనను ప్రకటించారని, జూన్ 2న ఇటలీ డే రోజున రాష్ట్రాన్ని విభజించారని కాంగ్రెస్ పార్టీ పైన ధ్వజమెత్తారు. ఏపీ కష్టాలపైన పదేపదే అడిగినా కేంద్రం నుంచి సహకారం లేదన్నారు.

ఆశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని, రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున పడేశారన్నారు. నిధులు, రాజధాని, పరిశ్రమలు లేక ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. విభజన చట్టంలో ఎన్నో వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన హామీలు, నిధుల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోవాలని ప్రధాని మోడీని ఇప్పటికే చాలాసార్లు కోరానని చెప్పారు. విభజన హామీల పరిష్కారానికి తాము రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి ఆఖరి పైసా వచ్చేవరకు విశ్రమించబోమన్నారు.

చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. ఎందరో మహనీయులను మనం గుర్తుంచుకోవాలన్నారు. అనంతపురం జిల్లా ఒకప్పుడు కరువుకు మారుపేరు అన్నారు. దేశవిదేశాల్లోని భారతీయులందరికీ అభినందనలు అన్నారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవాలు అనంతపురంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు. రాయలసీమను రాళ్ల సీమగా మార్చింది స్వార్థ నాయకులు అన్నారు.

రాయలసీమలో మహానుభావులు

రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాయలసీమలో పుట్టిన ఎందరో ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారన్నారు. తాళ్లపాక అన్నమయ్య, వేమన, బళ్లారి రాఘవ, పుట్టపర్తి సత్యసాయిబాబాలను తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదన్నారు.

అనంతపురంలో పుట్టిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో బాధ్యతలు చేపట్టి రాయలసీమ గొప్పదనాన్ని అమెరికాలో చాటారన్నారు. అనంతపురం జిల్లా ఒకనాడు కరువుకు మారుపేరుగా ఉండేదని, తమ హయాంతో పారిశ్రామిక, విద్యా, రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

1994-2004 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిందని, అంతర్జాతీయంగా రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004-2014 వరకు దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు.

తెలుగువారికి ప్రత్యక్ష దైవమైన ఎన్టీఆర్‌ సాక్షిగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా.. నిధుల లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. 2022 నాటికి ఏపీ మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా , 2029 నాటికి నంబర్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా ఉండాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే.. ఏపీ 10.99 శాతం సాధించి నంబర్‌ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో గుజరాత్‌ తర్వాత రెండోస్థానం, పెట్టుబడుల రాష్ట్రంలో మూడో స్థానంలో, ఉపాధి హామీ అమల్లో ప్రథమ స్థానంలో ఉన్నటు వెల్లడించారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి 7 గ్రిడ్లు, 5 మిషన్లు ఏర్పాటు చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.

కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, ప్రభుత్వం రాయలసీమ పైన దృష్టి సారించకుంటే మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనంతపురంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం పైన ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు

చంద్రబాబు

విభజన తర్వాత మూడోసారి జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను అనంతపురంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అన్నారు. అనంతపురంలోని నీలం సంజీవయ్య మైదానంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తులు ప్రాణత్యాగాల వల్లే స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో పుట్టిన ఎందరో ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అనంతపురంలో పుట్టిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో బాధ్యతలు చేపట్టి రాయలసీమ గొప్పదనాన్ని అమెరికాలో చాటారని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అనంతపురం జిల్లా ఒకనాడు కరువుకు మారుపేరుగా ఉండేదని, తమ హయాంతో పారిశ్రామిక, విద్యా, రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

నిధులు, రాజధాని, పరిశ్రమలు లేక ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఎన్నో వాగ్దానాలు చేశారని.. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన హామీలు, నిధుల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోవాలని ప్రధాని మోడీని ఇప్పటికే చాలాసార్లు కోరినట్లు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగువారికి ప్రత్యక్ష దైవమైన ఎన్టీఆర్‌ సాక్షిగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని చంద్రబాబు ఎన్ని ఇబ్బందులున్నా, నిధుల లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+