ఏపీపై నీళ్లు కుమ్మరించిన వాతావరణశాఖ
ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాబోయే ఐదురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం కనపడుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది.రాబోయే వారం రోజుల్లో వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐదురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలు కూడా వీయనున్నట్లు చెప్పింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ఒకటి రెండు చోట్ల వర్షాలు కురవనున్నాయి. వేడి, తేమతో అసౌకర్య వాతావరణ ఏర్పడనుంది. ఈ నెల 22 నుంచి 27వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. శనివారం ముంబయిలో వర్షాలు కురిశాయి. అవి తెలంగానలో కురవాల్సి ఉన్నప్పటికీ అరేబియా సముద్రం నుంచి మేఘాలు తెలంగాణవైపు రాకపోవడంతో ముంబయిలోనే వర్షాలు కురిశాయి. మేఘాలు వచ్చినా అనుకున్న స్థాయిలో చల్లదనం రాలేదు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు పడ్డాయి. నిజామాబాద్ లో వడగళ్ల వాన కురిసింది. ఏపీ మాత్రం భగ్గుమంటోంది.

మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో వానలు కురవనుండటంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు ఉంటాయని, కనీస జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications