India TV-CNX Opinion Poll : ఏపీలో వైసీపీ-టీడీపీ హోరాహోరీ ! ఎవరికెన్ని సీట్లంటే ?

ఇవాళ విడుదలైన ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే హోరాహోరీ తప్పదని తేలిపోయింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీకీ, విపక్ష టీడీపీకి మధ్య ద్విముఖ పోరు సాగుతున్న వేళ ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సర్వేలో ఏపీలో ఏయే పార్టీలు ఏయే స్ధానాలు గెలవబోతున్నాయో కూడా వెల్లడించారు.

ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి 15 లోక్‌సభ స్థానాలు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జనసేనకు ఒక్క సీటూ రాదని తేలిపోయింది. 2019 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 7 లోక్‌సభ స్థానాలను గెల్చుకోనుండగా.. అధికార వైఎస్సార్‌సీపీ 7 స్థానాలను కోల్పోవచ్చని అంచనా వేసింది.

India TV-CNX Opinion Poll : tug of war between ysrcp and tdp in andhrapradesh-here are details

ఈసారి ఏపీలో వైఎస్సార్‌సీపీకి 46 శాతం, టీడీపీకి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాలు తేల్చాయి. అలాగే కాంగ్రెస్‌, బీజేపీలకు 2 నుంచి 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇందులో జనసేనతో పాటు ఇతర పార్టీల గురించి పేర్కొనలేదు. అయితే టీడీపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరగబోతున్నట్లు మాత్రం సంకేతాలు ఇచ్చారు.

2019లో అరకు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, హిందూపురం, రాజంపేట మరియు చిత్తూరు లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. టీడీపీ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం సీట్లను గెల్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+