వైసీపీ గెలుస్తుందా..అయిదు లక్షలు ఇస్తాం : ఛాలెంజ్ స్వీకరించాలి: సందేహాలుంటే కాల్ చేయండి..!
ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఇప్పటి వరకు బెట్టింగ్‌లే చూసాము. ఇప్పుడు రాజకీయ ఫలితాల పైన జ్యోతిష్కులు తెర మీదకు వస్తున్నారు. నేతల గ్రహ స్థితుల ఆధారంగా గెలుపు ఓటములను విశ్లేషణ చేస్తున్నారు. ఇటువంటి వారికి సవాళ్లు చేస్తున్నాయి హేతు వాద సంఘాలు. ఎవరైతే ఎన్నికల ఫలితాలను ముందే చెప్పి..అవి నిజమైతే లక్షల రూపాయల్లో బహుమతి ఇస్తామంటూ ప్రకటిస్తున్నాయి.
ముందే చెబితే అయిదు లక్షలు..
ఏపీలో ఆసక్తి కరంగా మారుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన భారత నాస్తిక సమాజం సవాల్ విసిరింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందగానే చెప్పి..అవి నిజమైతే చెప్పిన జ్యోతిష్కులకు అయిదు లక్షలు బహుమతిగా ఇస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి ప్రకటంచారు.
కొంత మంది జ్యోతిష్కులు ఎన్నికల ఫలితాల పైన లెక్కలు వేసి ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడుతారు అనే విషయం మీద నమ్మిస్తున్నారని వారి నుండి సొమ్ము చేసుకుంటున్నానేది వీరి అభియోగం. ఇటువంటి వారి కోసమే తాము ఈ సవాల్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సరిగ్గా అంకెలతో సహా చెప్పిన వారికి ఈ బహుమతి ఇస్తామంటూ ముందుకు వచ్చారు.

వైసీపీ గెలుస్తుందా..అయితే ఛాలెంజ్
కొద్ది రోజులుగా విజయనగరం జిల్లా పార్వతీపురం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు మురపాక కాళిదాస్ నాడీ జ్యోతిష్యం ప్రకారం వైఎస్సార్‌సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని పైనా సంఘం ప్రతినిధులు స్పందించారు. తాము చేస్తన్న సవాల్‌కు కాళిదాస్ సైతం స్పందించాలని కోరారు.
వైసీపీ గెలిస్తే..ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పాలని..ఆయన చెప్పింది నిజమైతే ఆయనకు బహుమతి ఇస్తామని ప్రకటించారు. శాస్త్రీయ స్పృహను పెంచాల్సిన వారు కూడా జ్యోతిష్యం పేరుతో ఇలా చేయటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. దీని పైన ఎవరికైనా సందేహాలుంటే 94402 60280, 90106 96498 నంబర్లను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications