ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే రూ.25 లక్షల ఆదాయం.. పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్
డబ్బులు పొదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టిన నగదు రెట్టింపవ్వడానికి పోస్టాఫీస్ ను మించింది ఏదీ లేదని చెప్పవచ్చు.
డబ్బులు పొదుపు చేయడానికి చాలామంది అనేక మార్గాలను వెతుకుతుంటారు. డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో.. వాటిని పెట్టుబడిగా పెట్టి ఆ రూపాయి మీద మరో రూపాయి సంపాదించడం అంతకంటే కష్టంగా మారుతుంటుంది. చాలామంది రకరకాల పెట్టుబడులను పరిశీలిస్తుంటారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తమదగ్గర ఉన్న డబ్బు రెట్టింపవ్వాలనుకుంటారు. ఈ తరహా ఆలోచన చేసేవారికి భారత తపాలాశాఖ మంచిదని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం ఎన్నోరకాల పథకాలను పోస్టాఫీస్ ద్వారా అమలు చేస్తోంది. వీటిలో సుకన్య సమృద్ది ఒకటి. ఇంట్లో10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలను ఈ పథకంలో చేర్పించాలి. ఇలా చేరడంద్వారా మంచి రాబడి రావడమేకాక పన్ను రాయితీ కూడా లభిస్తోంది. ఇందులో మనం పెట్టుబడి పెట్టే మొత్తం మీద 7.6 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇది చాలా ఆకర్షణీయమైన వడ్డీ అని చెప్పవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన కాలపరిమితి 21 సంవత్సరాలు. ఇందులో చేరినవారు 15 సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రతి నెలా ఈ పరిమితిలో మీరు డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడంవల్ల మెచ్యూరిటీ అమౌంట్ కూడా మారుతుంది. ఉదాహరణకు మీరు మీ బాబుపై నెలకు రూ.5వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా మీరు క్రమం తప్పకుండా 15 సంవత్సరాలు చేయండి.

ఏడాదికి రూ.60వేల చొప్పున 15 సంవత్సరాలకు రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టినట్లవుతుంది. వడ్డీ రేటు 7.6 శాతం ఇస్తున్నారు. అంటే అసలు, వడ్డీ కలిపితే రూ.25 లక్షలు అవుతుంది. ఎటువంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి భారత ప్రభుత్వమే ఇస్తున్నట్లుంటుంది. వడ్డీ రేటు పెరిగితే మనకొచ్చే అమౌంట్ కూడా పెరుగుతుంది. వడ్డీరేటు తగ్గేదేమీ ఉండదు. ఈ పథకంలో చేరినవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications