ఏపీ కొంప ముంచిన నైరుతి రుతుపవనాలు

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వానలు పడుతున్నాయి. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు నైరుతి రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.

రాజాంలో అత్యధికంగా..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా రాజాంలో 78.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

indian meteorological Department is predicting the slowdown of southwest monsoon in ap

రుతుపవనాల మందగమనం
ఏపీలో నైరుతి రుతుపవనాలు మందంగా కదులుతున్నాయి. ఈనెల రెండోతేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతాలు మినహా ఎక్కడా వర్షాలు కురియడంలేదు. రోహిణీకార్తెలో ఉండే ఎండలను తలపిస్తూ వేడి మండిస్తోంది. ఈనెల 8న నైరుతి రుతుపవనాలు గోదావరి జిల్లాలను తాకాయి. అయితే శుక్రవారం నాటికి ఉత్తరాంధ్రకు కూడా విస్తరించలేదు.

దీంతో ఇవి ఎందుకు ఇంత మందగమనంగా కదులుతున్నాయనే పరిశోధనలో అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పూర్తిగా విస్తరించేందుకు మరో మూడు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. మూడు రోజులు గడిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+