ఐక్యూ మెన్సా క్లబ్‌లో భారత సంతతి బాలుడు రోహన్: తండ్రి ఏపీవాసి
లండన్: భారత సంతతికి చెందిన పదమూడేళ్ల బ్రిటన్ బాలుడు వెంకట సత్య శ్రీ రోహన్ చిక్కం.. ఐక్యూ పరీక్షలో అరుదైన ప్రతిభ కనబరిచాడు. అత్యధిక ఐక్యూ కలిగిన మెన్సా క్లబ్‌లో అతను చేరాడు. ఇతని తండ్రి విష్ణు చిక్కం ఆంధ్రప్రదేశ్ వాసి.
ప్రస్తుతం విష్ణు బ్రిటన్‌లో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఐక్యూ పరీక్షలైన కెటెల్ 3బి పేపర్, కల్చర్ ఫెయిర్ స్కూల్‌లను 161 మార్కులతో అధిగమించి, ప్రపంచంలోని అత్యంత తెలివిగల మొదటి ఒక శాతం మేధావుల సరసన చేరాడు. తద్వారా మెన్సా క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు.

రోహన్ చిన్న నాటి నుంచే పలు అంశాల్లో ప్రతిభ కనబరిచేవాడు. గణితం, మేథోపరమైన చిక్కుముడులు విప్పడం వాటి పైన ఆసక్తి చూపించేవాడు. గత ఏడాది బ్రిటన్ గణిత పోటీల్లో సైతం బంగారు ధ్రువపత్రాన్ని కైవసం చేసుకున్నాడు. రెట్రో స్కేప్ అనే మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశాడు.












Click it and Unblock the Notifications