తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లు... చాలా చీప్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నవరాత్రుల్లో ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకునేవారికి శుభవార్త. ఇండిగో సంస్థ మంచి ఆఫర్లతో ముందుకు వచ్చింది. తక్కువ ధరకే ఇండిగో విమానాల్లో టికెట్లను పొందొచ్చు. గణేష్ చతుర్థితోపాటు రాబోయే పండగల సీజన్ లో ప్రయాణికులు కుటుంబంతోనో, స్నేహితులతోనే సమయాన్ని గడపడానికి వీలుగా సంస్థ దీన్ని తీసుకువచ్చింది. ఈ ఆఫర్ పరిమిత కాలమే ఉంటుంది.

సెప్టెంబరు 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు చౌక విమానయాన టికెట్లను పొందొచ్చు. ప్రయాణికులకు రౌండ్ ట్రిప్ పై 15 శాతం తగ్గింపును పొందుతారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 25 నుంచి మార్చి 31 వరకు ప్రయాణించే విమానాల్లో 15 శాతం తగ్గింపును పొందొచ్చు.

indigo flight tickets cost

ఇండిగో ఈ ఆఫర్ ను ఈనెల 18వ తేదీన విడుదల చేసింది. 20వ తేదీ వరకు వర్తిస్తుంది. రెండురోజుల్లోనే విమాన ప్రయాణికులు తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇండిగో వెబ్ సైట్, ఇండిగో మొబైల్ యాప్, ఇండిగో ట్రావెల్ పార్ట్ నర్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలి. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రోమో కోడ్ ను వర్తింప చేయాలి. పండగ సీజన్లలో రద్దీని పెంచడమే తమ ఉద్దేశమని సంస్థ చెబుతోంది.

ఇండిగో కోడ్ షేర్ కనెక్షన్లతో సహా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలకు దీన్ని వర్తింప చేస్తోంది. గణేష్ చతుర్థి సందర్భంగా గణేషుడు ఇంటికి వస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేసింది. బప్పా ఇంటికి వస్తున్నాడని, పేర్కొంటూ ఇండిగోలో కూర్చున్న గణపతి బప్పా మోదకం ఆస్వాదిస్తూ ప్రయానిస్తున్నాడు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు వస్తున్నాడు అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+