మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంద్ర బస్సు దగ్ధం: ఎగిసిన మంటలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: మెదక్ జిల్లా కొండపాక శివారులో మంగళవారం ఉదయం కరీంనగర్-2 డిపోకు చెందిన ఇంద్ర బస్సు అగ్నికి ఆహుతైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే బస్సు దగ్ధమైందని భావిస్తున్నారు. ఈ ఇంద్ర బస్సు విలువ రూ.80 లక్షలని తెలుస్తోంది. బస్సుతో పాటు ప్రయాణికులకు చెందిన విలువైన వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయి.

కరీంనగర్‌లో ఉదయం బయల్దేరిన ఏపీ21 జడ్ 159 బస్సు కొండపాక శివారులోకి రాగానే వెనుక వైపు నుంచి కాలిన వాసన రావడంతో డ్రైవర్ రవీందర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపేశారు. బ్యాటరీ వైర్లు తొలగించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

బస్సులో నుంచి 41 మంది ప్రయాణికులు దిగేలోపే బస్సులో మంటలు ప్రారంభమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి అందరూ చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసేసరికే నష్టం జరిగిపోయింది.

కాలిన బస్సు 1

కాలిన బస్సు 1

మెదక్ జిల్లాలో ఇంద్ర బస్సులో మంటలు లేచాయి. సహాయ బృందాలు మంటలను ఆర్పడానికి ఇలా ప్రయత్నాలు చేశారు.

కాలిన బస్సు 2

కాలిన బస్సు 2

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంద్ర బస్సులో మంటలు లేచినట్లు అనుమానిస్తున్నారు. ఇలా మంటల లేచి పొగ అలుముకుంది.

కాలిన బస్సు 3

కాలిన బస్సు 3

మెదక్ జిల్లా కొండపాక వద్ద బస్సులో మంటలు లేచాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది ఇలా..

కాలిన బస్సు 4

కాలిన బస్సు 4

కాలిన తర్వాత ఇంద్ర బస్సు లోపలి దృశ్యం ఇలా ఉంది. లోహం తప్ప ఏదీ మిగలకుండా బస్సు కాలిపోయింది.

కాలిన బస్సు 5

కాలిన బస్సు 5

మెదక్ జిల్లాలో ఇంద్ర బస్సులో మంటలు లేచాయి. మంటలను ఆర్పడానికి సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి.

కాలిన బస్సు 6

కాలిన బస్సు 6

బస్సుకు మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. కణకణ మండే మంటల్లో బస్సు ఇలా దగ్ధమైంది.

కాలిన బస్సు 7

కాలిన బస్సు 7

డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి డ్రైవర్ ప్రయాణికులను దించేసి బస్సును పక్కన అపేశాడు.

English summary
Indra bus has been burnt at Kondapaka in Medak district. No harm has been done to the passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X