దసరా వేళ ఇంద్రకీలాద్రికి వెళ్తున్నారా - దర్శనాలు, అలంకారాలు, పూర్తి సమాచారం..!!
శరన్నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు రేపు (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు 11 అవతరాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సారి సాంకేతికతను వినియోగిస్తూ దర్శనం.. పార్కింగ్.. సేవలు సహా అన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శనం కు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేసారు.
ఇంద్రకీలాద్రి పై భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ సారి ఉత్సవాల వేళ కొండ కు వచ్చే భక్తులకు అన్ని రకాల సేవలు.. సమాచారం అందించేందుకు చాట్‌బాట్ సేవలను ఈ నంబరుతో 94418 20717 అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఏఐ ఆధారిత సంభాషణ వేదికగా రూపొందించారు. ఈ నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకున్నా తర్వాత మీ వాట్సాప్‌లో అమ్మ లేదంటే హాయ్ అనే మెసేజ్ చేయాలి. వాట్సాప్‌లో మెసేజ్ చేయగానే తెలుగు, ఆంగ్లం ఏ భాషలో సమాచారం కావాలని అడుగుతుంది. తర్వాత మెయిన్ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని టచ్ చేస్తే, వరుసగా దర్శనం, విరాళాలు, గ్రీవెన్స్, సదుపాయాలు, సేవలు, పండగలు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో దేనినైనా టిక్ చేస్తే ఆ వివరాలన్నీ మొత్తం మెసేజ్ రూపంలో వస్తాయి. యాప్‌లో సేవలన్నీ చాట్‌బాట్‌లోనూ అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాదు.. 10 రోజులు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి కూడా దసరా ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు కనక దుర్గ 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన మూల నక్షత్రం రోజు.. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు: బాలత్రిపుర సుందరి దేవిగా, 23 రెండవ రోజు: గాయత్రీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. 24 మూడవ రోజు: అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఉంటుంది.
ఇక, సెప్టెంబర్ 25 నవరాత్రి నాలుగవ రోజు: కాత్యాయని దేవిగా.. సెప్టెంబర్ 26 నవరాత్రి ఐదో రోజు: మహాలక్ష్మి దేవిగా దర్శనం ఇస్తారు. సెప్టెంబర్ 27 నవరాత్రి ఆరో రోజు: లలితా త్రిపుర సుందరి దేవిగా, సెప్టెంబర్ 28 నవరాత్రి ఏడో రోజు: మహాచండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఉంటుంది. సెప్టెంబర్ 29 నవరాత్రి ఎనిమిదో రోజు: సరస్వతి దేవిగా, సెప్టెంబర్ 30 నవరాత్రి తొమ్మిదో రోజు: దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 1 నవరాత్రి 10వ రోజు: మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 2 వ తేదీ విజయ దశమి : రాజరాజేశ్వరి దేవిగా అభయం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాలు అక్టోబర్ 2 ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications