అమరావతి.. వయా హైద్రాబాద్: బాబుపై విదేశీ ఇండస్ట్రియలిస్ట్స్ ఒత్తిడి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విదేశీ పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి చేరుకోవడానికి విమాన సర్వీసులు లేకపోవడం పెద్ద అవరోధం అవుతోందా? పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా ప్రయాణానికి విదేశీ సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోందా? అంటే అవునని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

విభజన నేపథ్యంలో ఏపీ.. అమరావతిని తన కొత్త రాజధానిగా ఏర్పాటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం విదేశాలు తిరుగుతున్నారు. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అమరావతికి సరైన విమాన సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

ఏపీలో, ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ విదేశీ సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు.

Also Read: పరువు-ప్రతిష్ట: రాజధానే కాదు.. హైటెక్ బాబుకు 'బెజవాడ' పరీక్ష!

Industrialists pressure on Chandrababu

అమరావతిలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న జపాన్‌ నుంచి ఓ రకంగా నేరుగానే విమాన సర్వీసుల కోసం ప్రభుత్వంపై ఒత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో తలపెట్టిన పెట్టుబడుల భాగస్వామ్ సదస్సుకు వివిధ దేశాల నుంచి వివిధ సంస్థలు ఆసక్తి చూపించాయి.

అయితే, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం తమ దేశం నుంచి అమరావతి వచ్చేందుకు సరైన విమాన సదుపాయాలు కావాలని అంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం విదేశీ పారిశ్రామికవేత్తలు రాజధాని ప్రాంతానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ రావాల్సి వస్తోంది.

Also Read: తెలంగాణ దెబ్బ!: ఏపీ వారికి శుభవార్త, తగ్గనున్న మొబైల్ ధరలు

అక్కడి నుంచి చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ కానీ, షెడ్యూల్‌ విమానాలలోగానీ గన్నవరం రావాల్సి వస్తోంది. పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు నచ్చుకున్నప్పటికీ.. సర్వీసులు లేకపోవడం వల్ల భయపడే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. నేరుగా అమరావతికి సర్వీలు లేకపోవడాన్ని విదేశీ పెట్టుబడిదారులు అసౌకర్యంగా భావిస్తున్నారట.

టోక్యోకు అమరావతి నుంచి డైరెక్టు విమానం కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారట. సింగపూర్ పారిశ్రామికవేత్తల అభిప్రాయం కూడా అలాగే ఉందని చెబుతున్నారు. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Foreign industrialists pressure on AP Government to direct flight to Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి