ఎపికి కాంగ్రెస్ అన్యాయం చేయలేదు: తెలంగాణ కాంగ్రెసు నేత డికె అరుణ

తిరుమల/ గుంటూరు: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేదని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు డికె అరుణ వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన ఆమె సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ ఏపీకి ఎలాంటి అన్యాయం చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, అన్ని పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా తెలంగాణ వచ్చేదే అని ఆమె అన్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌క నష్టం జరగకుండా రాజధాని నిర్మాణం, నిధులు, పరిశ్రమల ఏర్పాటు ఇలా అన్ని విధాల న్యాయం జరిగేదని అరుణ అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా అన్నీ మరచి రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు అన్యోన్యంగా కలిసిమెలసి ఉండాలని ఆమె కోరారు.

 Injustice to AP was not done by Congress: DK Aruna

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఒత్తిడి

ఏపీకి ప్రత్యేక హో దాపై ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రపక్ష బీజేపీపై అన్నివిధాలుగా ఒత్తిడి తె స్తున్నారని, ఈ నెల 20లోపు కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన రైతుబజార్‌ను ప్రారంభించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయవాడలోని రైతు బజార్‌ పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.

వర్షాకాలంలో కూ డా రైతు బజార్లో ఇబ్బందులు లేని విధంగా నిర్మించామని తెలిపారు. అలాగే రైతుబజార్‌ను మరింత అభివృద్ధి పరచడానికి రూ. కోటి రూపాయలు మం జూరు చేస్తామని పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా రైతుబజార్‌ను అధునాతనంగా తీర్చిదిద్దామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+