అవార్డుల విషయంలో 'అఖండ'కు అన్యాయం?
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021 డిసెంబరులో విడుదలైన ఈ సినిమా కరోనా తర్వాత బాక్సాఫీస్ ను షేక్ చేసి పరిశ్రమకు కొత్త ఊపిరులూదింది. కథతోపాటు కథనం కూడా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలో పాత్ర కోసం బాలకృష్ణ ప్రాణం పెట్టిచేశారు. యాక్షన్ సన్నివేశాలుకానీ, సినిమాలో వచ్చే సీన్లు కానీ వేరే లెవల్ లో ఉంటాయి.
తాజాగా జాతీయ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు నటుడు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పుష్ప సినిమాలోని నటనకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా అవార్డుల పంట పండించుకున్నాయి. అవార్డులకు సంబంధించి అఖండ సినిమాకు అన్యాయం జరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసివుంటే వందలకోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టేదంటున్నారు.

బాలయ్యతోపాటు సినిమాకు సంగీతం అందించిన తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి సన్నివేశానికి ప్రాణం పోశారు. కొన్ని కేటగిరిలో అవార్డులు రాలేదంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. త్వరలో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీస్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రరాజానికి దర్శకుడు అనిల్ రావిపూడి. యాక్షన్ సీన్లను ఆయన ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టలని అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications