వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటిదొంగలపై జగన్ సీరియస్-నకిలీలపై కొరడా-వరుస స్కాంలపై సర్వత్రా చర్చ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్ లో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇప్పటికే మోసాల్ని ప్రభుత్వం ఎక్కడికక్కడ గుర్తిస్తుండగా.. నకిలీ చలానాలు, నకిలీ లబ్దిదారుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నాలు పెడుతున్నారు. దీంతో అసలే అప్పుల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో బయటపడిన సీఎంఆర్ఎఫ్ నకిలీ లబ్దిదారుల స్కాంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ నకిలీల వ్యవహారంపై సీఎం జగన్ కూడా సీరియస్ అవుతున్నారు.

ఏపీలో ఖాళీ ఖజానా

ఏపీలో ఖాళీ ఖజానా


ఏపీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఖజానా ఖాళీగా మారిపోయింద్. దీంతో ఎప్పటికప్పుడు అప్పులు తెస్తూ ఖర్చుపెట్టడం తప్పనిసరిగా మారిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల్ని సకాలంలో ఇస్తే చాలనుకనే స్ధాయికి ప్రభుత్వం చేరిపోతోంది. సంక్షేమ పథకాల్లో అక్రమాలను గుర్తించి లభ్దిదారుల్లో కోత పెట్టేందుకు సైతం ప్రభుత్వం దారులు వెతుకుతోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి నకిలీల బెడత పెరిగిపోతోంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్లు వంటి శాఖల్లో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోతున్నాయి.

నకిలీ చలానాల స్కాం

నకిలీ చలానాల స్కాం

ఏఫీ రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారం ఈ మధ్య కాలంలో తీవ్ర కలకలం రేపింది. దళారులతో కుమ్మక్కై కొందరు డాక్యుమెంట్ రైటర్లు నకిలీ చలానాలు సృష్టించి సొమ్ముచేసుకోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.12 కోట్ల ఆదాయానికి గండిపడింది. అయితే ప్రభుత్వం సకాలంలో దీన్ని గుర్తించి వెంటనే తనిఖీలు చేపట్టింది. దీంతో సగానికి పైగా డబ్బును ఇప్పటికే రికవరీ చేయగలిగారు. మిగిలిన సొమ్మును కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉన్న డజను మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పండ్ చేయడం కలకలం రేపింది.

 సీఎంఆర్ఎఫ్ నకిలీ లబ్దిదారుల స్కాం

సీఎంఆర్ఎఫ్ నకిలీ లబ్దిదారుల స్కాం

తాజాగా సచివాలయంలో ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా అందించే సాయాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో మరో స్కాం బయటపడింది. ఇందులోనూ ప్రభుత్వంలో ఉన్న వారు దళారులతో కుమ్మక్కై సీఎం సహాయనిధి నుంచి డబ్బుల్ని నకిలీ లబ్దిదారుల ఖాతాల్లోకి మళ్లించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో దాదాపు 50 మంది నకిలీ లబ్దిదారుల డేటాను సేకరించి ఇంటిదొంగలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.. అసలే ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా సీఎం సహాయనిధి విషయంలో మాత్రం కోతలు విధించడం లేదని చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో ఇంటి దొంగలు నకిలీ లబ్దిదారుల డేటాతో ఈ డబ్బుల్ని కొల్లగొట్టిన వ్యవహారంపై ఏసీబీ కేసులు నమోదు చేస్తోంది.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
ఇంటిదొంగలపై జగన్ సీరియస్

ఇంటిదొంగలపై జగన్ సీరియస్

ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న నకిలీ చలానాల స్కాం నుంచి తేరుకోకముందే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ నిధుల్ని నకిలీ లబ్దిదారుల సాయంతో పక్కదారి పట్టించిన ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. నకిలీ చలానాల వ్యవహారం బయటికి రాగానే ప్రభుత్వంలో ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ సీఎఁ జగన్ గతంలోనే మండిపడ్డారు.

ఇప్పుడు సీఎంఆర్ఆఫ్ స్కాం కూడా బయటపడటంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఇంటిదొంగల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎంవో నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. దీంతో రెండు రోజుల్లో ఏసీబీ కేసుల నమోదు, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

English summary
andhrapradesh government falls in another trouble after acb lodges cases on cmrf fake beneficiaries scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X