జల్సాలు: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చోరీలు (ఫోటోలు)
తిరుపతి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా అగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ చర్యల్లో భాగంగా తిరుపతిలో బుధవారం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పట్టుబడిన ఏడు మంది దొంగల్లో ఆరుగురు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం విశేషం. విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడి డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను చోరీచేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 20 మోటారుసైకిళ్లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి క్రైం పోలీసుస్టేషన్‌లో బుధవారం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం... రామచంద్రాపురం మండలం నూతుగుంటపల్లెకు చెందిన సునీల్‌కుమార్‌రెడ్డి అలియాస్ సుధీర్‌కుమార్‌రెడ్డి చంద్రగిరిలోని ఓ కాలేజీలో బీకాం చదువుతున్నాడు.
సి.మల్లవరానికి చెందిన షేక్ ఫారూఖ్, అదే గ్రామానికి చెందిన తేజారెడ్డి చంద్రగిరిలోని అదే కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తిరుపతి మాధవనగర్‌కు చెందిన పసుపులేటి హరి ఎంఆర్‌పల్లెలోని ఓ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు.
అలాగే రామచంద్రాపురం మండలం బీరమాకులకండ్రిగకు చెందిన ఎద్దుల బాబురెడ్డి గొల్లపల్లి వద్దగల ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాడుపడిన వీరు డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీచేస్తూ పోలీసులకు పట్టుబడ్డారని వెల్లడించారు.

జల్సాల కోసం ఇంజనీరింగ్ విద్యార్ధులు చోరీలు
డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 20 మోటారుసైకిళ్లు, కంప్యూటర్లను ప్రదర్శనకు ఉంచిన దృశ్యం.

ఇంజనీరింగ్ విద్యార్ధులు చోరీలు పాల్పడి పట్టుబడ్డ ద్విచక్ర వాహానాలను తిరుపతి క్రైం పోలీసుస్టేషన్‌లో బుధవారం నాడు పరిశీలిస్తున్న అర్బన్ ఎస్పీ గోపీనాథ్.

జల్సాల కోసం ఇంజనీరింగ్ విద్యార్ధులు చోరీలు
తిరుపతి క్రైం పోలీసుస్టేషన్‌లో బుధవారం నాడు ఇంజనీరింగ్ విద్యార్ధుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్న అర్బన్ ఎస్పీ గోపీనాథ్.

Click it and Unblock the Notifications