అందరూ తప్పకుండా చదవాల్సిన వైసీపీ ఎంపీ ఆసక్తికర పోస్ట్!!
సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడే అనేక పోస్టులను పెడుతుంటారు. తాజాగా పిల్లల ఆరోగ్యం గురించి ఆయన ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. టీవీల తోటి, మొబైల్స్ తోటి వస్తున్న ఆరోగ్య సమస్యలను గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన విజయసాయిరెడ్డి గత 42 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక అధ్యయనం గురించి పేర్కొన్నారు.
చిన్నతనంలో టీవీ ఎక్కువగా చూసే వారికి బిపి, ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గత 42 ఏళ్లుగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైందని విజయ సాయి రెడ్డి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం టీవీ స్థానంలో మొబైల్ వచ్చిందని, ఇది ఇప్పుడు రోగాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఒక మొబైల్ చూసేవారు ఊబకాయ బాధితులుగా మారుతారని అధ్యయనం వెల్లడించింది అన్నారు.

ఈరోజుల్లో చాలామంది పిల్లలు చిన్న వయసులోనే మొబైల్ కు బానిసలుగా మారుతున్నారని, అందుకే వారు చిన్న వయసులోనే పెద్ద వ్యాధుల బారిన పడటానికి కారణంగా మారుతుందని అధ్యయనం వెల్లడించిందని విజయ సాయి రెడ్డి తెలిపారు. ఈ అధ్యయనంలో పిల్లల స్క్రీన్ సమయం మరియు వయస్సు పెరిగే కొద్దీ పెరిగిన ఆరోగ్య సమస్యల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కనుగొన్నారని తెలిపారు.
ఈ అధ్యయనం 1972-1973లో న్యూజిలాండ్‌లోని డునెడిన్ మల్టీడిసిప్లినరీ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ యూనిట్ ద్వారా ప్రారంభించబడిందని పేర్కొన్న ఆయన అధ్యయనం నిర్వహించిన డునెడిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని ప్రివెంటివ్ మరియు సోషల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎండి డాక్టర్ ఆర్ జె హాన్‌కాక్స్ ఈ అధ్యయనం ద్వారా కీలక విషయాలను వెల్లడించారన్నారు.పిల్లలు మరియు యూత్ టీవీ చూసినప్పుడు, మొబైల్ ఫోన్లు వాడినప్పుడు తక్కువ ఆక్సిజన్ ను తీసుకుంటారన్నారు.
ఇది అధిక రక్తపోటుతో పాటు చిన్న వయసులోనే ఊబకాయం రేటు పెరగడానికి కారణమవుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువసేపు టీవీ చూడడం మరియు ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లలో ఉండడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలకు చెప్పడం చాలా ముఖ్యమని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. పిల్లలు మరియు యువతకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications