వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయా?: కారణాలివే!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా వైసిపి మాటెత్తని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ పార్టీ ఎంపీలను ప్రశంసించారు. 2019లో టిడిపి - బిజెపి కలిసే పోటీ చేస్తాయా అనే ప్రశ్నకు చంద్రబాబు ఢిల్లీలో సమాధానం చెప్పారు.

<strong>జగన్‌కు చెక్ చెబుదాం: అమిత్ షా ద్వారా మోడీ వద్దకు బాబు రాయబారం!</strong>జగన్‌కు చెక్ చెబుదాం: అమిత్ షా ద్వారా మోడీ వద్దకు బాబు రాయబారం!

మరోవైపు, అధికార యావ లేని జనసేన అధినేత, ఆయనకు లెఫ్ట్ పార్టీలు జతకలవడం గమనార్హం. ఇక, 2019లో అధికార పీఠం ఎక్కాలని వైసిపి బలంగా భావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వీరు ఒక్కటవుతారా అనే చర్చ సాగుతోంది.

2019 నాటికి ఏమవుతుంది?

2019 నాటికి ఏమవుతుంది?

2019 నాటికి ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. టిడిపి - బిజెపి దూరం అయ్యే అవకాశాలుంటాయని భావించారు. కానీ చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఆ పార్టీలు దూరమయ్యే పరిస్థితి లేదని తేలిపోయింది.

పవన్ కళ్యాణ్‌కు జగన్ తోడవుతారా?

పవన్ కళ్యాణ్‌కు జగన్ తోడవుతారా?

మరోవైపు, పవన్ కళ్యాణ్ జనసేన - లెఫ్ట్ పార్టీలు ఒక్కటయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా పవన్ కళ్యాణ్ ట్వీట్‌తో మరో చర్చ కూడా జరుగుతోంది. జనసేన - లెఫ్ట్‌లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడు కానుందా అనే చర్చ సాగుతోంది.

ఈ కారణాలతో.. ఒక్కటైనా ఆశ్చర్యం లేదు

ఈ కారణాలతో.. ఒక్కటైనా ఆశ్చర్యం లేదు

ఎందుకంటే అన్ని పార్టీలు (విపక్ష పార్టీలు) కూడా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా భావిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇప్పటికే జనాల్లో చొప్పించాయి. ప్రజల్లోను సెంటిమెంట్ బలంగా ఉంది. విపక్షాలన్ని కలిస్తే ప్రత్యేక హోదా అంశం మరింత పదును అవుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎలాగు అధికారం మీద వ్యామోహం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యం. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించారు. ఇక లెఫ్ట్ పార్టీలు ఇతరులతో జత కలిసేవిగా మిగిలాయి.

వైసిపి టార్గెట్ అధికారం

వైసిపి టార్గెట్ అధికారం

మిగిలింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వైసిపి నేతలు భావిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు అధికారం చేతికి వచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు. ఈ నేపథ్యంలో హోదా కోసం 2019 నాటికి ఈ మూడు ఏకమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన

నియోజకవర్గాల పునర్విభజన

2019లో ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే కేసులు, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఇబ్బందులు పడుతున్న జగన్‌కు ఇప్పుడు కేసుల చిక్కు మరలా వచ్చి పడింది.

ఇది చాలదన్నట్లు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ఉపయోగించి జగన్‌కు చెక్ చెప్పాలనుకుంటున్నారు.

టిడిపి వ్యూహంతో ఆ దిశగా జగన్ పావులు కదుపుతారా?

టిడిపి వ్యూహంతో ఆ దిశగా జగన్ పావులు కదుపుతారా?

175 నియోజకవర్గాలను 2019 నాటికి 225గా చేయాలని బీజేపీ నేతల వద్ద పావులు కదుపుతున్నారు. తమకు అనుకూలంగా పునర్విభజన చేసి, జగన్‌ను దెబ్బకొట్టాలనుకుంటున్నారు.

ఇలా వరుసగా తనకు ఎదురుగాలులు వీస్తుండంతో జగన్ కూడా అప్రమవుతారని అంటున్నారు. కేసులు, నియోజకవర్గాల పునర్విభజనతో తనను దెబ్బకొట్టాలని టిడిపి - బిజెపి భావిస్తే జగన్... సేఫ్ సైడ్ కోసం పవన్ కళ్యాణ్ - లెఫ్ట్ పార్టీల వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.

English summary
It is said that interesting turn in Andhra Pradesh politics after Jana Sena chief Pawan Kalyan praising YSR Congress Party MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X