చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. మంత్రి అంబటి షాకింగ్ రియాక్షన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో ఈరోజు విడుదల కానున్నారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని రాజమండ్రి జైలు అధికారులకు పంపించనుంది.
ఈ కాపీ అందిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఈరోజు సాయంత్రం చంద్రబాబును విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ మంత్రులు నేతలు చంద్రబాబు బెయిల్ పైన తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడును నిత్యం టార్గెట్ చేసే వైసిపి మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. కోర్టు అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం నాలుగు వారాలపాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు సోషల్ మీడియాలో నిజం గెలిచికాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు కనుక మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టు పోస్ట్ చేశారు.
చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా చంద్రబాబు కు బెయిల్ ఇచ్చారు కానీ చంద్రబాబు నిజాయితీని చూసి కాదు అంటూ అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కూడా టిడిపి అధినేత చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన తనదైన శైలిలో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
నిన్నటికి నిన్న తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిడిపికి రాజీనామా చేయడంతో జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది మరి పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో అంటూ పోస్ట్ పెట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసింది.. త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి రాబోతుంది అంటూ అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. తాజాగా చంద్రబాబు బెయిల్ ని కూడా టార్గెట్ చేసిన ఆయన అనారోగ్యంతోనే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications