విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాన్‌కు ఉరేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ చదువుతున్నవ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మధిరవాడలో ఉన్న మాస్టర్ మైండ్స్‌లో గీత్ అనే విద్యార్ధిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

ఫీజు కోసం కళాశాల యాజమాన్యం విద్యార్ధినిపై ఒత్తిడి తీసుకురావడంతో సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్ధి సంఘాలు మాస్టర్‌ మైండ్స్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో సోమవారం చోటు చేసుకుంది. రేమిడిచర్లకు చెందిన మన్నేపల్లి (26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతాళలేకే ఊరి చివరన ఉన్న పొలంలో మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

ఫీజుల కోసం వేధింపులకు గురి చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక బంధువులు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

పరిహారం ఇవ్వడానికి విద్యా సంస్థ అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. రాజీవ్ గృహ కల్ప సముదాయంలో గీత్ ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతోంది.

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

తల్లి అమరావతి, తమ్ముడితో కలిసి ఉంటోంది. ఆదివారం ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందినట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది.
ఫ్యాన్‌కు ఉరేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

అయితే, ఆమె ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని బంధువులు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు విద్యాసంస్థ అంగీకరించింది.

English summary
Intermediate girl student suicide in visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X