నేడు అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం , ఎన్టీఆర్ కు వెన్నుపోటుపై సాయిరెడ్డి సంచలనం, సోషల్ మీడియాలోనూ రచ్చ !!
ఆగస్టు 23.. అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం. అదేంటి నిజంగానే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం ఉందా ? అని ఆశ్చర్యపోతున్న వారికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తూ సంచలన విషయాన్ని గుర్తు చేశారు . ఆగస్టు 23వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశాడు. 23.8.1995 ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కుని, ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు అంటూ విజయ సాయి రెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ పదవి పోగొట్టుకుని నేటికి 26 సంవత్సరాలు
ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన తరువాత దేశవ్యాప్తంగా వెన్నుపోటు రాజకీయాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు వెన్నుపోటు రాజకీయాల మీద రచ్చ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అనేక సందర్భాలలో చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రస్తావించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరూ ఊహించని విధంగా అనేక నాటకీయ పరిణామాల మధ్య నాడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని పోగొట్టుకోవడం, పార్టీతో పాటు అధికార పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడం జరిగి నేటికీ 26 సంవత్సరాలు.

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి పోస్ట్
ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మామ ఎన్టీఆర్ వెనుక కత్తి చేతిలో పట్టుకుని నిలుచున్న చంద్రబాబు నాయుడు ఫోటో ను పోస్ట్ చేసి ఆసక్తికర చర్చకు కారణమయ్యారు. ఇటీవల అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను విజయ సాయి రెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి రాజు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ నుండి ఎన్టీఆర్ ను గెంటేసిన వారిలో అశోకగజపతి రాజు ఒకరని , ఎన్టీఆర్ ని గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబు అయితే రెండో పేరు అశోక్ గజపతిదని విమర్శించారు.

వెన్నుపోటు రాజకీయాలపై కొడాలి నాని, చంద్రబాబు టార్గెట్ గా రాం గోపాల్ వర్మ కూడా
అంతకుముందు వైసీపీ మంత్రులు కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని, పదేపదే ఎన్టీఆర్ ను టార్గెట్ చేసేవారు. ఇక కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీసిన విషయం కూడా తెలిసిందే. అందులో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన హైలెట్ చేశారు.

ఆగస్ట్ నెలలో చంద్రబాబుపై వెన్నుపోటు అస్త్రం
నేటికీ చంద్రబాబును వెన్నుపోటు రాజకీయాలపై టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు ఆగస్టు నెల మాత్రం మర్చిపోరు. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు బాబు వెన్నుపోటు రాజకీయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నే ఉన్నారు. అంతర్జాతీయ వెన్నుపోటు దారుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు అంటూ నేటికీ విమర్శిస్తున్న తీరు అందుకు నిదర్శనం. టిడిపి నేతలు ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరుగుతూనే ఉన్నారు .

సాయిరెడ్డి ట్వీట్ తో ఆసక్తికర చర్చ .. వైస్రాయ్ హోటల్ వేదికగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు
1995 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గద్దె దించడానికి చంద్రబాబు తెరవెనుక కుట్ర చేశాడని, నిత్యం ఆయన పక్కనే ఉంటూ ఆయనకు తెలియకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీ నుండి అత్యంత అవమానకరంగా గెంటేసి, సెప్టెంబర్ ఒకటో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడని విమర్శిస్తున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు చంద్రబాబును, చంద్రబాబుకు సహకరించి మామను వెన్నుపోటు పొడవడంలో కీలకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం.. సోషల్ మీడియాలో టార్గెట్ చంద్రబాబు
ఇక సోషల్ మీడియా వేదికగా ఆగస్ట్ 23 ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు శ్రీకారం చుట్టి నేటికి 26 ఏళ్లని , ఆగస్టు 23వ తేదీన కుట్ర మొదలైందని, ఇప్పుడు 23 వ తేదీన 23 సీట్లతోనే టిడిపి మిగిలిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం అవుతోంది. తమ్ముళ్ళందరికీ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ ని సస్పెండ్ చేశారు బహిష్కరించారు, అయినా సరే ఎన్టీఆర్ బొమ్మ వాడుకుంటారు అంటూ వైసిపి ఫాలోయర్స్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు అప్పటినుండి ఇప్పటివరకు భారతరత్న ఇస్తూనే ఉన్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

బుచ్చయ్య తో లింక్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వైసీపీ ఫాలోయర్స్
నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు, బాలకృష్ణలు కూడా వెన్నుపోటు పొడిచారని పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు వెన్నుపోటు సమయంలో రామారావు కు మద్దతుగా 29 మంది లో ఇప్పుడు టిడిపిలో ఉన్న చివరాఖరి వ్యక్తి బుచ్చయ్యచౌదరి అంటూ ఇక బుచ్చయ్యచౌదరి కూడా టార్గెట్ చేసి, బయటకు నెట్టేసే ప్లాన్లో చంద్రబాబు ఉన్నారని పోస్టులు పెడుతున్నారు. బుచ్చయ్య చౌదరి వెన్నుపోటు సమయంలో రామారావు కు మద్దతుగా ఉండటం వల్లే ఇప్పుడు ఆయనను టార్గెట్ చేశారని ఆసక్తికర ట్వీట్ లు పెడుతున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications