చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
CV Anand: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసులే భద్రతను కల్పించడం ప్రాధాన్యతను సంతరించరుకుంది. చరిత్రలో తొలిసారి ఓ దేశ ప్రధానికి పూర్తిగా మహిళా పోలీసులతో పహారా ఏర్పాటుచేయబోతోండటం చర్చనీయాంశమైంది. మహిళ ఫోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలను తెలియజేశారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగింటి ఆడపడుచులు, మాతృసమానులైన మహిళామణులకు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ట్వీట్ పోస్ట్ పెట్టారాయన. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యతగా అభివర్ణించారు.
మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేసి అద్భుత ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనని చంద్రబాబు అన్నారు.
తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్‌లో కూడా మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 4,332 కోట్ల రూపాయలను కేటాయించామని, తద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
అలాగే దీపం 2 స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పని చేస్తున్నామని అన్నారు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్ముతున్నామని చెప్పారు.
మహిళల భద్రతకు, వారి గౌరవానికి, సామాజిక, ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలియజేశారు. కాగా- ఈ మధ్యాహ్నం ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి హాజరు కానున్నారు. మహిళలతో ముఖాముఖిగా సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications