అమెరికా వలే చాలాకాలం పట్టదు, సత్య నాదేళ్ల మావాడే: బాబు, హైదరాబాద్‌పై మళ్లీ
విశాఖ: అమెరికా, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి చెందేందుకు చాలాకాలం పట్టిందని, ప్రస్తుత సాంకేతిక యుగంలో అంత సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏపీకి చెందినవాడేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
విశాఖలో రెండో రోజు పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతిక రంగంలోను భారత్ శక్తి అద్భుతమన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోందన్నారు.
పెట్టుబడులకు భారత్ అనుకూలమని చెప్పారు. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని వృద్ధి సాధించేది భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. అతిపెద్దతైన భారత్ మార్కెట్లో అద్భుతాలు సృష్టించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌కు ఉన్న అనుకూలతలు ఎవరికీ లేవన్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏపీకి చెందినవాడన్నారు. అమెరికా, జపాన్ అభివృద్ధి చెందేందుకు చాలా సమయం పట్టిందన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో అంత సమయం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు.
మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే ఆ తర్వాత పదేళ్ల పాటు హైదరాబాదులో భాగస్వామ్య సదస్సుల గురించి పట్టంచుకోవడం మానేశారన్నారు. సన్ రైజ్ ఏపీకి విస్తృత సముద్రతీరం ఓ వరం అన్నారు.
40 శాతం మెరైన్ ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతాయన్నారు. మూడు నాలుగేళ్లలో ఏపీ కరువురహితం అవుతుందన్నారు. ఏపీలో సహజవనరులకు కొదువ లేదన్నారు. హాంకాంగ్, సింగపూర్ కంటే పోర్టు ఆధారిత అభివృద్ధి ఏపీకి ఎక్కువ అన్నారు.

ఆరు నెలల్లో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్ని వనరులు ఉన్నా, కరువు వేధిస్తోందన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. కర్నూలును కలుపుతూ హైదరాబాద్ - బెంగళూరును ఆర్థిక కారిడార్‌గా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రపంచంలోనే పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూలమైతే, భారత్‌లో ఏపీ అనుకూలమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు తాము నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు.

అత్యధిక తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో దేశానికే మార్గదర్శిగా నిలువనుందని, ఇక్కడ ఏర్పడే పెట్రో కారిడార్, ఐటీ సెజ్ తదితరాలు లక్షల మందికి ఉపాధిని కల్పించనున్నాయని అభిప్రాయపడ్డారు. భారత యువత గణితం, సాంకేతిక రంగాల్లో అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు.
తాను ఆహ్వానిస్తేనే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చిందని, అదే ఐటీ రంగం అభివృద్ధికి నాందిగా మారిందని వివరించారు. తాను సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో హైదరాబాద్ వేదికగా నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి, వాటిని విజయవంతం చేశానన్నారు. ఆ తర్వాత పదేళ్లలో ఈ తరహా సదస్సుల గురించి పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications