తిరుమలలో భక్తులు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యకు చెక్

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 74,130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,631 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.03 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

కాగా.. తిరుమలలో రూపుదిద్దుకుంటోన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) బయోగ్యాస్ ప్లాంట్ పనులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. కాకుళమానుతిప్పలోని ఈబ ప్లాంట్‌ నిర్మితమౌతోంది. అయిదు నెలల క్రితం దీనికి టీటీడీ శంకుస్థాపన చేసింది. ఈ ప్లాంట్ మార్చి నాటికి పూర్తవుతుందని, మేలో అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. రోజుకు 40 టన్నుల సామర్థ్యం గల ఈ బయోగ్యాస్ ప్లాంట్ టీటీడీకి ఏటా 1.52 కోట్ల రూపాయలను ఆదా చేస్తుంది.

IOCL Biogas Plant at Tirumala Nears Completion Aiming to Go Operational by May says TTD Chairman

టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి గతంలో బీఆర్ నాయుడు భూమిపూజ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్.. టీటీడీకి ఎల్పీజీని నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ నిర్మితమౌతోంది.

తిరుమలలో ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాల్లో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలిస్తారు. ఈ ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్‌, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.

తొలుత బీఆర్ నాయుడు.. సుదర్శన్ సదన్‌ను తనిఖీ చేశారు. అక్కడి గదులను పరిశీలించారు. ఇంజినీరింగ్ పనుల గురించి ఆరా తీశారు. గదుల్లో లీకేజీ సమస్య ఉన్నట్లు భక్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని నివారించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. భవనాన్ని ఆధునీకరించాలా లేక పునర్నిర్మించాలా అన్నదానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

అనంతరం ఆయన వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో మాట్లాడారు. టీటీడీ కల్పిస్తోన్న సౌకర్యాలు, ఇతర వసతుల గురించి వారి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం బీఆర్ నాయుడు సుదర్శన్ సదన్ అన్న ప్రసాదం కౌంటర్ వద్ద శ్రీవారి సేవకులతో కలిసి కలిసి భక్తులకు అన్న ప్రసాదాలనలు వడ్డించారు. ఆ సమయంలో ఆయన వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఉన్నతాధికారులు ఛైర్మన్‌కు తోడుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+