చంద్రబాబు- ప్రశాంత్ కిశోర్ భేటీపై స్పందించిన ఐప్యాక్: కీలక వ్యాఖ్యలు- జగన్ అగైన్..!!
Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
I-PAC has been working in collaboration with @YSRCParty since last year. Together, we're dedicated to working tirelessly until @ysjagan secures a thumping victory again in 2024 and continues his unwavering efforts to better the lives of the people of Andhra Pradesh.
— I-PAC (@IndianPAC) December 23, 2023
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశాంత్ కిశోర్.. ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో బిహార్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. సొంతంగా పార్టీని నెలకొల్పారు.
అలాంటి ప్రశాంత్ కిశోర్.. ఉన్నట్టుండి విజయవాడలో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు.

ఈ భేటీపై ఐప్యాక్ స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని తేల్చి చెప్పింది. సంవత్సర కాలంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నామని, దీన్ని మున్ముందు కొనసాగిస్తామని ఐప్యాక్ వివరించింది.
2024లో కూడా ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికీ నిరంతరాయంగా శ్రమిస్తోన్నామని తెలిపింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications