విశాఖ ఐపిఎల్ మ్యాచ్‌లో వీధి కుక్కల హడావుడి(ఫొటోలు)
విశాఖపట్నం: నగరంలోని మైదానంలో మంగళవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కాసేపు వీధి కుక్కలు హడావుడి చేశాయి. అంతేగాక, మ్యాచ్‌కు కొంత అంతరాయం కూడా కలిగించాయి.
ఏకంగా మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి చొచ్చుకొచ్చేసింది ఓ వీధి కుక్క. అప్పటికే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

విరామం తర్వాత ఛేదనకు దిగిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడింది. ఈ దశలో మైదానంలోకి కుక్క రావడంతో క్రీజులో ఉన్న ఓపెనర్లు రహానె, ఖవాజా ఏకాగ్రత లోపిస్తుందని అసహనానికి గురవగా.. ఢిల్లీ ఫీల్డర్లు రిషబ్ పంత్, కౌల్టర్ నైల్, క్రిస్ మోరిస్ దాన్ని బుజ్జగించి బయటికి పంపే ప్రయత్నం చేశారు.

కాగా, ఓ టవల్‌తో పంపేందుకు నైల్ కాసేపు ప్రయత్నించాడు. ఇలా దాదాపు రెండు మూడు నిమిషాల పాటు వారితో ఆడుకున్న ఆ కుక్కను ఆ తర్వాత మైదానం సిబ్బంది వచ్చి బయటికి పంపేశారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications