PSR Anjaneyulu: ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులకు సీఐడీ కోర్టు షాక్..!
ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆయన్ను సీఐడీ అరెస్టు చేసి విచారణ చేస్తోంది. ఇందులో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఆయన్ను తమ కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు రాబడతామని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల వెనుక ఎవరున్నారు ? ఆమెను వేధించేందుకు కుట్ర ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా అమలు చేసారనే విషయాలపై మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.

వచ్చే ఆది వారం, సోమవారం, మంగళవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీఎస్సార్ ఆంజనేయులుపై విచారణ జరిపేందుకు సీఐడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న పీఎస్సార్ ఆంజనేయుల్ని సీఐడీ రేపు అదుపులోకి తీసుకోనుంది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్ గా మారిన మరో ఐపీఎస్ విశాల్ గున్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పీఎస్సార్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇందులో జగన్ సీఎంవో పాత్రపై సీఐడీ మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications