వందకుపైగా కేసులు: ఎట్టకేలకు ఇరానీ గ్యాంగ్ లీడర్ పట్టివేత
హైదరాబాద్: ఎట్టకేలకు ఇరానీ గ్యాంగ్ లీడర్ అబూ బకర్ అరెస్టయ్యాడు. 101 కేసుల్లో నిందితుడైన అబూ బకర్ అరెస్టయిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి 3.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇరానీ గ్యాంగ్ మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. హైదరాబాదు, సికింద్రాబాదు కమిషనరేట్ల పరిధిలోనే ఇరానీ గ్యాంగ్‌పై వందకు పైగా కేసులున్నాయి.

వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాదులోని ఎస్సార్‌నగర్ నుంచి నడుచుకుంటూ వెళుతున్న యువకుడు(28) ఎర్రగడ్డలో బాటా షోరూం ఎదుట ఉన్న మెట్రో పిల్లర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది.
తలకు, ఛాతికి తీవ్రమైన గాయాలవడంతో మృతిచెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications