విశాఖ - అండమాన్ దీవులు.. తక్కువ ఖర్చుతో ఐఆర్సీటీసి సూపర్ ప్యాకేజ్!

అందమైన ప్రకృతి దృశ్యాలతో, ప్రత్యేకమైన సున్నపురాయి గుహలతో, పగడపు దిబ్బల తో, ముత్యాల సాగుతో ప్రదేశాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని నింపే ఓ అద్భుతమైన సుందర పర్యాటక ప్రాంతాన్ని చూడాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతుంటారు. మరి ఇంతకీ ఇన్ని సొగసులతో ఉన్న పర్యాటక ప్రాంతం ఏంటి? దాని విశిష్టత ఏంటి? అక్కడికి వెళ్లాలంటే ఎలా వెళ్లాలి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అండమాన్ దీవుల పర్యటనకు ఐఆర్సిటీసీ అద్భుతమైన ప్యాకేజ్
సుందరమైన పర్యాటక ప్రాంతం అండమాన్ దీవులు. అద్భుతమైన ప్రకృతి సోయగానికి, అంటే అద్భుతమైన జీవ వైవిధ్యానికి పేరెన్నిక గన్న అండమాన్ దీవులకు ఒక విశేషమైన చరిత్ర ఉంది వివిధ సంస్కృతుల సమ్మేళనమైన అండమాన్ దీవులు పర్యాటకులను అక్కడ ఉన్న అద్భుతాలతో ఆకట్టుకుంటున్నాయి. ముత్యాల ఆభరణాలు, సముద్ర గవ్వలతో చేసిన వస్తువులు అండమాన్ దీవుల ప్రత్యేకత. అటువంటి అండమాన్ దీవులకు సంబంధించి ఐఆర్సిటిసి ఒక అద్భుతమైన టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC amazing package from Visakhapatnam to Andaman Islands at a low cost

Take a Poll

ఫ్లైట్ లో విశాఖ నుండి అండమాన్ దీవులకు టూర్
చాలా సుందరమైన దీవులతో, తెల్లని ఇసుక బీచ్ లతో, మడ అటవీ అందాలతో, కోరల్ ఐలాండ్స్ కు ప్రసిద్ధి చెందిన అండమాన్ దీవులకు సంబంధించి irctc టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలోని విశాఖపట్నం నుండి ఈ ప్యాకేజ్ ను అందిస్తున్నట్టు పేర్కొంది. ltc స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్ పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ఫ్లైట్లో వెళ్లేందుకు కంఫర్ట్ క్లాసులో జర్నీ చేసేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి ప్యాకేజ్ అందిస్తోంది.

నవంబర్ 20 నుండి నవంబర్ 25 వరకు ప్యాకేజ్
నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఐదు రాత్రులు, ఆరు రోజులు ఈ ప్యాకేజ్ ను అందిస్తోంది. పోర్ట్ బ్లెయిర్, రాస్ నార్త్ బే ఐలాండ్, హావ్ లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ వంటి ప్రాంతాలను చూసేందుకు ఈ ప్యాకేజ్ నిర్దేశింపబడింది. మొత్తం ఒక వ్యక్తికి 48 వేల 990 రూపాయలతో ఈ ప్యాకేజ్ ప్రారంభమవుతుంది. త్రీ స్టార్ హోటల్లో వసతి కల్పిస్తారు.

ఐఆర్సీటీసి ద్వారా బుక్ చేసుకుంటే బెనిఫిట్
ప్రయాణ ప్రణాళిక ప్రకారం ఏసీ వాహనాల ద్వారానే అన్ని సందర్శన స్థలాలను చూపిస్తారు. ప్రైవేట్ ఏసీ ఫెర్రీలు, క్రూయిస్ ల ద్వారా అంతర ద్వీప ప్రయాణాన్ని చేయిస్తారు. అవసరమైన అన్ని ప్రవేశ అనుమతులు, టిక్కెట్లు, ఫెర్రీ చార్జీలు అన్ని ప్యాకేజీలో భాగంగా చూసుకుంటారు. అధికారిక irctc టూరిజం వెబ్సైట్ లేదా irctc అధికృత కార్యాలయాల ద్వారా ఈ టూర్ కి వెళ్లాలనుకునే వారు బుక్ చేసుకోవచ్చు.

తొలిరోజు ఇలా
విశాఖపట్నం నుండి 20వ తేదీ ఉదయం ఎనిమిది గంటల 25 నిమిషాలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటుంది. అక్కడినుండి హోటల్ కి చెకింగ్ చేసి మధ్యాహ్నం సెల్యులర్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ చూస్తారు. తర్వాత సెల్యులార్ జైల్లో రైట్ అండ్ షో ను ఆస్వాదిస్తారు. పోర్ట్ బ్లెయిర్ లో రాత్రి భోజనం, బస చేస్తారు.

అద్భుత ప్రదేశాల సందర్శన
రెండవ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్, నార్త్ బే చూస్తారు. మధ్యాహ్నం తర్వాత సముద్రిక నావెల్ మెరైన్ మ్యూజియం వీక్షిస్తారు. పోర్ట్ బ్లెయిర్ లో రాత్రి భోజనం బస చేస్తారు. మూడవ రోజు హావ్ లాక్ ద్వీపానికి వెళతారు. అక్కడ హోటల్లో చెకిన్ చేసి సాయంత్రం రాధానగర్ బీచ్ కి వెళ్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. నాలుగవ రోజు హావ్ లాక్ ద్వీపం, నీల్ ఐలాండ్ ను సందర్శిస్తారు.

తిరిగి విశాఖకు ఇలా
ఐదవ రోజు భరత్ పూర్ బీచ్లో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరుతారు. అక్కడ స్థానికంగా ఆ రోజంతా షాపింగ్ చేసుకొని రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు. ఆ తర్వాత రోజు ఉదయం ఏడు గంటల 25 నిమిషాలకు విశాఖపట్నం రావటానికి ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ చేస్తారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+