ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కేంద్రం శుభవార్త
ఏపీ నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో యాత్రలకు వీటిని నడుపుతున్నారు. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రాలకు ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 27న ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా వెళుతుంది. అలాగే వచ్చేనెల ఆరోతేదీన తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. వివరాలకు 92814 95848, 89773 14121 నెంబర్లలో సంప్రదించాలి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 16, 23, 30 తేదీల్లో హైదరాబాద్-కటక్(07165), 17, 24, మే 1 తేదీల్లో కటక్-హైదరాబాద్(07166) రైళ్లు నడుస్తాయి. రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్లలో స్టాప్స్ ఇచ్చారు. ఈ నెల 19 నుంచి జూన్ 28 వరకు సికింద్రాబాద్-సంత్రాగచ్చి(07223), ఈనెల 20 నుంచి జూన్ 29 వరకు సంత్రాగచ్చి-సికింద్రాబాద్(07224) ప్రత్యేక రైళ్లు కూడా నడవనున్నాయి. ఇవి సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయి. ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు సికింద్రాబాద్-షాలిమార్(07225), ఈనెల 16 నుంచి జూన్ 25 వరకు షాలిమార్-సికింద్రాబాద్(07226) ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, సామర్లకోట, తుని స్టేషన్లలో ఆగనున్నాయి.

రైళ్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వేలైను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభిస్తున్నారు. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే విశాఖ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. అలాగే విజయవాడ-గూడూరు మధ్య కూడా మూడోలైను నిర్మాణం జరుగుతోంది. అతి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications