ఇండియన్ రైల్వే తియ్యటి వార్త
ఒక రైలు బోగీని మొత్తం బుక్ చేసుకునేవారికి ఇకనుంచి ఐఆర్ సీటీసీ కేటరింగ్ సర్వీసులు అందించబోతోంది. గ్రూప్ టూర్ కు వెళ్లేవారు.. పెళ్లిళ్లు.. ఇతర కార్యక్రమాలకు దూరప్రాంతాలకు వెళ్లేవారు బోగీని బుక్ చేసుకుంటుంటారు. దీన్ని ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ అంటారు. ఇలా ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌పై బుక్ చేసిన కోచ్‌లు, రైళ్లలో ఇప్పటివరకు క్యాటరింగ్ సౌకర్యం లేదు. తాజాగా ఆ సౌకర్యాన్ని సంస్థ కల్పించబోతోంది.
బోగీని లేదంటే రైలు మొత్తం కోచ్ ను బుక్ చేసుకోవాలంటే 6 నెలల ముందుగా లేదంటే ప్రయాణ తేదీకి నెలరోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా 10 కోచ్ లను బుక్ చేసుకోవడానికి వీలుంది. మొత్తం రైలు కావాలంటే రెండు స్లీపర్ కోచ్ లతో సహా 24 కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. ఏడురోజుల జర్నీకి ఒక్కో కోచ్ కు రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణాన్ని పొడిగిస్తే ఒక్కో కోచ్ కు రోజుకు రూ.10వేల చొప్పున చెల్లించాలి. 18 కోచ్ లు కావాలంటే రూ.9 లక్షలు చెల్లించాలి. 18 బోగీలకు మించితే ఒక్కో బోగీకి అదనంగా రూ.50వేలు చెల్లించాలి. సంబంధిత డివిజన్ కార్యాలయంలోని అధికారిని కలిసి మీకు ఏ తరహాలో బుకింగ్ కావాలో తెలియజేయవచ్చు.

రైల్వే కార్యాలయంలో చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్‌ని సంప్రదించి, ప్రయాణ వివరాలతో కూడిన వ్రాతపూర్వక అభ్యర్థనను అందించాలి. సిస్టమ్ జనరేటెడ్ స్లిప్ తీసుకొని యూటీఎస్ కౌంటర్‌కు వెళ్లి డబ్బులు జమ చేసి రిసిప్ట్ తీసుకోవాలి. బుకింగ్ అయిపోయిన తర్వాత రైలు బయల్దేరే స్టేషన్ మేనేజర్‌కు ప్రయాణికుల జాబితా ఇవ్వాలి. ftr.irctc.co.in వెబ్‌సైట్‌లో కూడా బుకింగ్ చేయొచ్చు.












Click it and Unblock the Notifications