తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారా, ఆ క్షేత్రాలతో సహా - ప్రత్యేక ప్యాకేజీ..!!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి కీలక అప్డేట్. ఐఆర్‌టీసీ తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఒక కొత్త ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ నుంచి తిరుమలకు వయా ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా స్పెషల ప్యాకీజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలోనే తిరుమల దర్శనంతో పాటుగా ప్రముఖ ఆలయాల దర్శనాలకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ ప్యాకేజీకి డిమాండ్ ఏర్పడింది. ఇటువంటి ప్రత్యేక ప్యాజీల కు ఆదరణ కనిపిస్తోంది.

ఐఆర్‌టీసీ తిరుమల శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రత్యేక రైలు మార్గం ద్వారా విశాఖ నుంచి తిరుమల వరకు మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనతో ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరి, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోటమీదుగా ప్రయాణించి తిరుమలకు చేరుకుంటుంది. ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇక తిరుమలతో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, శ్రీకాహస్తి ఆలయాల సందర్శన ఈ ప్యాకేజీలో కల్పించారు. అయితే ఆగస్టు 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22 తేదీల్లో ప్రయాణానికి టికెట్లు ఇప్పటికే విక్రయాలు పూర్తయ్యాయి.

IRCTC Special package from Vizag to Tirumala via Pilgrim stations, details announced

మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగే అవకాశం ఉంది. సెప్టెబరు 29 తర్వాత నుంచి ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ప్రకటన మేరకు ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. శనివారం ఉదయం 4 గంటల 05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి ప్యాకేజీలో ఛార్జీలు నిర్దారిస్తారు. ఏసీ గదిలో బస.. ఏసీ రవాణా సదుపాయం, రెండు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజన సదుపాయం యాత్రికులకు కల్పిస్తున్నారు.

విశాఖ నుంచి తిరుమల చేరుకొనే ఈ ప్యాకేజీలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల దర్శన టికెట్లూ కలిపి నిర్ణయించారు. ప్రభుత్వం నియమించిన ఏపీటీడీసీ గైడ్ యాత్రికులకు తోడుగా ఉంటారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు 250 రూపాయలు ఛార్జీగా వసూలు చేస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల ముందు రద్దుచేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవనేది ప్రయాణీకులు గమనించాని అధికారులు సూచన చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ రైళ్లకు ఈ మధ్య కాలంలో భారీ డిమాండ్ ఏర్పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+