ఏపీ మంత్రికే షాకిచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ-చివరికి ఈఎన్సీకి సరెండర్..!
ఏపీలో తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మంత్రులకు అధికారులు వరుసగా షాకులిస్తున్నారు. ఏకంగా మంత్రులు జారీ చేస్తున్న ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వారికి చిర్రెత్తి తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే రవాణా మంత్రి విషయంలో ఇలాంటి ఘటన జరగగా.. ఇప్పుడు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వంతు వచ్చింది.
జలవనరులశాఖ కృష్ణా ఎస్ఈగా పనిచేస్తున్న ప్రసాదబాబు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి షాకిచ్చారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి నుంచి 16,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చినా నిర్లక్షంగా వ్యవహరించారు. అలాగే పులిచింతంతల ప్రాజెక్ట్ నుండి 10 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేయాలని ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. దీంతో జలవనరుల మంత్రి రామానాయుడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆయన్ను ఈఎన్సీకి సరండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు ఈ విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

సదరు ఎస్ఈ ప్రసాద్ బాబు ఫీల్డ్ కు వెళ్లకుండా ఆఫీస్ లోనే కూర్చుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రసాద్ బాబు 16,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీనితో ప్రసాద్ బాబును ఈఎన్సీకి సరండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి చివరి ఆయకట్టుకు నీరు అందాలని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని వృధా కాకుండా చూడాలని సిఎం చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. రైతుకోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications