చంద్రబాబు టెక్నాలజీలో వెనకబడ్డారా? వైసీపీ క్లాప్ కార్యక్రమం తర్వాత టీడీపీ ఫ్లాప్ షో పై చర్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై తెగ మదన పడుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ చేపట్టిన అనేక నిరసన కార్యక్రమాలపై ప్రజలు ఎలాంటి దృష్టి పెట్టకపోవడంపై చర్చిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద దూకుడు చూపించే తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనుకబడుతుంది అన్నదానిపై పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతోంది. ఇక ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గాంధీ జయంతి నాడు క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కోసం క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘట్టం తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనానికి కారణమైంది.

వైసీపీ డ్రోన్ టెక్నాలజీ .. చెత్త వాహనాల లాంచ్ పై చర్చ
ఇంతకీ ఏం జరిగిందంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గాంధీ జయంతి రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నాలుగువేల వాహనాలను చేర్చి, ఒకేసారి లాంచ్ చేశారు. ఆ వాహనశ్రేణిని డ్రోన్ కెమెరా లతో విజువల్స్ తీయించి మీడియాకు రిలీజ్ చేశారు. నాలుగు వేల వాహనాలు ఒకేసారి రోడ్లపై పరిగెడుతున్న దృశ్యాలు ప్రజల్లో ఆసక్తి కలిగించాయి. డ్రోన్ విజువల్స్ తో దృష్టిని ఒక్కసారిగా చెత్త సేకరణ వాహనాలపై నిలిపేలా వైసిపి ప్రభుత్వం చేసిన ప్లాన్ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ హయాంలో అన్ని ఏ కార్యక్రమమైనా డ్రోన్ షాట్స్ .. వాహనాల లాంచ్ ల హంగామా
చెత్త సేకరణ వాహనాలను మాత్రమే కాదు, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాల లాంచ్ ఇదేవిధంగా అట్టహాసంగా చేసింది. గతంలో బెంజిసర్కిల్ నుంచి 104,108 అంబులెన్సులను, రేషన్ షాప్ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇదేవిధంగా జిల్లాలకు తరలించారు. దిశా బైక్ ల తరలింపు అప్పుడు కూడా ప్రజలందరి దృష్టి భారీ వాహనాల లాంచ్ కార్యక్రమంపైన పడింది. అందుకు డ్రోన్ కెమెరాలతో తీసిన విజువల్స్ కారణమయ్యాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు, రోడ్ షో లు, బహిరంగ సభలు ఏవైనా సరే ఈ తరహా విజువల్స్ తో వైసీపీ జనం దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా వాటి మీద జనం దృష్టి కేంద్రీకరించలేకపోవడానికి తాము ఎంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించామో తెలియకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు.

టీడీపీ హయాంలోనూ భారీగా కార్యక్రమాలు .. కానీ డ్రోన్ టెక్నాలజీ లేక నో పబ్లిసిటీ
గతంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాడు రైతు రథం పేరుతో 13 జిల్లాలకు సుమారు 20 వేల ట్రాక్టర్లను ఇచ్చి ఉంటామని, ఈ కార్యక్రమాన్ని కూడా ఒకేసారి లాంచ్ చేస్తే బాగుండేదని, ప్రజలకు గుర్తుండేదని పార్టీ నేతలతో చెబుతున్నారని సమాచారం. ట్రాక్టర్ లను ఒకే చోట ఉంచి ప్రారంభిస్తే అది పెద్ద మెగా ఈవెంట్ లా ఉండేదని, డ్రోన్ కెమెరా లతో విజువల్స్ తీయించి ప్రచారం చేస్తే ప్రజలు ఎప్పటికీ మరిచిపోయేవారు కాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే కాదు నాడు టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు చాలామంది తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల కోసం ఎంతో చేసిందని, కానీ వాటిని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనుకబడిందని అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు టెక్నాలజీలో వెనుకబడ్డారా ?
గతంలో టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చామని కానీ వాటికి ఈ తరహా ప్రచారం చేయకపోవడమే తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవడానికి కారణమని చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ఈ తరహాలో లాంచ్ చేస్తే బాగుండేదని, ప్రజల దృష్టి పడే దని చాలా మంది టీడీపీ నేతలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు అని సమాచారం. టెక్నాలజీని వినియోగించటంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అని చెప్పుకునే స్థాయి నుంచి టెక్నాలజీలో చంద్రబాబు వెనుక పడ్డారా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు అని సమాచారం.

టీడీపీలో డ్రోన్ విజువల్స్ .. ప్రజలపై వాటి ఇంపాక్ట్ పై చర్చ
అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఏం చేయాలి ? అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుంది ఎక్కడ ? వైసిపి సక్సెస్ మంత్ర ఎక్కడ ఉంది ? అన్న అంశాలపై తెలుగు తమ్ముళ్లు గట్టిగానే ఫోకస్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాలంలో టిడిపి సమావేశాల్లోనూ ఏం చెయ్యాలి అన్న చర్చ సమయంలో డ్రోన్ కెమెరాల విజువల్స్ పై, వాటి ప్రభావంపై బాగానే చర్చ జరుగుతోందని తెలుస్తుంది.
Recommended Video

సోషల్ మీడియా వాడకంలో టీడీపీ ఎంత చేసినా డ్రోన్ టెక్నాలజీతో దెబ్బ కొడుతున్న వైసీపీ
సోషల్ మీడియాను విపరీతంగా వాడుకునే తెలుగుదేశం పార్టీ నిత్యం పది మంది నాయకులను ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా లైవ్ పెట్టి మరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. మరోపక్క వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటుంది. ఇక క్షేత్రస్థాయిలో ప్రజలను తమ పోరాటంలో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతును కూడగట్టలేకపోతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలతో తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి కార్యక్రమమైన డ్రోన్ విజువల్స్ తో ఒక్కసారిగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న వైసిపి టెక్నాలజీ వాడకంపైనే తెలుగు తమ్ముళ్లు తెగ బాధ పడుతున్నారని సమాచారం. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications