చంద్రబాబు అంత ఘోరమైన తప్పిదం చేశారా?: నీచమంటూ ఆ మహిళ ఆగ్రహం
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ఆరోపణలు చేశారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. 'సాక్షి'లో వచ్చిన కథనం ప్రకారం.. ఓ మహిళను అత్యాచారం చేసి, హతమార్చారంటూ ఆమె ఫొటోను చూపిస్తూ చంద్రబాబు ప్రచారం చేశారు.
అయితే, ఆ ఫొటోలోని మహిళ జీవించి ఉండటం గమనార్హం. అంతేగాక, తాను బతికే ఉన్నానంటూ మీడియా ముందుకొచ్చి ఆమె తన వాదన వినిపించింది. రాజకీయ లబ్ధి కోసం అంతన నీచమైన ఆరోపణలు చేస్తారా? అంటూ ఆ మహిళ చంద్రబాబును నిలదీసింది.

ఇది ఇలా ఉండగా, నంద్యాలలో ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. డబ్బులు పంచుతున్నారు.. ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ.. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications