కుప్పంలో చంద్రబాబుకు ఎదురొచ్చిన అపశకునం

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు ఇక్కడ మకాం వేశారు.

ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనపరిచిన దూకుడును అసెంబ్లీలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

chandra babu in kuppam

ఈ పరిస్థితుల మధ్య- సుదీర్ఘ విరామం అనంతరం ఆయన తొలిసారిగా కుప్పానికి వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు సాగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైనందున అసెంబ్లీ బరిపై గురి పెట్టారాయన.

రెండు రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గంపై వరాల సునామీని కురిపించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కుప్పం విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కుప్పం పట్టణాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు.

ఈ పర్యటనలో ఆయనకు అన్నీ అపశకునాలే ఎదురవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం శ్రీవేంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు చేస్తోన్న సమయంలో ఈ ఘటన సంభవించింది. స్వామివారి పటానికి హారతి ఇస్తోన్న సమయంలో అందులో ఉన్న కర్పూరం కింద పడటాన్ని కీడుగా భావిస్తోన్నారు తెలుగుదేశం పార్టీ వర్గాలు.

దీనికి సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వైఎస్ఆర్సీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తొంది. చంద్రబాబు ఈ సారి కుప్పాన్ని వదలక తప్పదని, ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి తప్పదనే సంకేతం ముందుగానే వచ్చిందంటూ కామెంట్స్ పెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+