మాజీ మంత్రి రోజా సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజా మాట్లాడిన మాట్లాడకపోయినా సంచలనమే. ప్రస్తుతం గత ఎన్నికల ఓటమితో సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతున్న రోజా పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన నోరు పారేసుకున్న రోజా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో రోజా సైలెంట్ అయ్యారు.

రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై
అలాగే నగరి నియోజకవర్గంలో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె పొలిటికల్ కెరీర్ పైన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా తమిళనాడులోనే తిరుగుతున్న రోజా తమిళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారని, ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతారని ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Is Ex-minister Roja taken sensational decision

రోజా పై జరుగుతున్న ప్రచారానికి కారణం ఇదే
రోజా సొంత నియోజకవర్గమైన నగరిలోనూ సొంత పార్టీలో ఆమెకు శత్రువులు ఉండడంతో వైసీపీలో ఇమడలేకపోతున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఓ పక్క వైసిపి అధికారంలో లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ నేతలతో ఉన్న సమస్యలు, వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళదామన్నా ఏపీలోని ఇతర పార్టీలలోకి వెళ్లలేని పరిస్థితి వెరసి రోజా రాజకీయాలలో ఎలాంటి అడుగు వేయాలో అర్థంకాక తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారని ప్రచారం సాగుతుంది.

రోజా సైలెన్స్ తోనూ అనుమానం
అయితే గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ కెరీర్ పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా దీనిపైన ఇప్పటివరకు రోజా స్పందించలేదు. ఇది నిజమా.. అబద్దమా.. తన రాజకీయ భవితవ్యం ఏంటి అన్న విషయం పైన రోజా ఇప్పటివరకు మాట్లాడలేదు. దీంతో కూడా ఆమె రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుంటారన్న అనుమానం బలపడుతుంది.

రోజా మౌనం వీడితేనే విషయం తెలిసేది
అయితే రోజా పార్టీ మారుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న వార్తల పైన ఆమె వేగంగా స్పందిస్తే బాగుంటుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీ రాజకీయాలకు నిజంగానే రోజా గుడ్ బై చెబుతారా? రోజా రాజకీయాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారా? అన్నదానికి రోజానే సమాధానం చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+