వైసీపీ నేత‌లు మాట్లాడే భాష‌ మ‌నుషులు మాట్లాడేదేనా?: కాల్వ శ్రీనివాసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ నేత‌లు మాట్లాడే భాష‌ మ‌నుషులు మాట్లాడేదేనా? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో మంత్రి కాల్వ మీడియాతో మాట్లాడారు.

సభ్య‌స‌మాజం అస‌హ్యించుకునేలా మాట్లాడ‌డం జ‌గ‌న్‌కే చెల్లిందని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎంని ఉరితీయాల‌ని, న‌డిబ‌జారులో కాల్చి చంపేయాల‌ని మాట్లాడార‌ని అన్నారు. ఇది అంద‌రూ ముక్త కంఠంతో ఖండిస్తే ఆవేద‌నతో మాట్లాడాన‌ని ఈసీకి చెప్పి, మ‌ళ్లీ అటువంటి వ్యాఖ్య‌లే చేశారని తెలిపారు.

minister-kalva-srinivasulu

తుని విధ్వంసం కేసు నుంచి.. రాజ‌ధాని భూముల్లో చెరుకు తోట‌లకి నిప్పుపెట్టిన ఘ‌ట‌న‌ల వ‌ర‌కు దాని వెనుక‌ ప్రత్యక్షంగానో, ప‌రోక్షంగానో వైసీపీ ఉందని మంత్రి కాల్వ అన్నారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్ర‌బాబు మీద, మంత్రి లోకేశ్ బాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తోన్న వ్యాఖ్య‌లు చూస్తోంటే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ఎలా దిగ‌జార్చేలా చేస్తున్నారో తెలుస్తోంద‌ని అన్నారు. మాట‌తీరుని చూసి ఆ నాయకుడు ఎటువంటి వాడో చెప్పొచ్చు అన్నారు.

జ‌గ‌న్‌ రాజ‌కీయ చెల్లె‌మ్మ రోజ‌మ్మ అని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అలాగే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, కొడాలి నాని లాంటి వారు కూడా ఎలా మాట్లాడుతున్నారో అంద‌రికీ తెలుసని అన్నారు. వీరు నలుగురు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అంగీక‌రించ‌ని భాష‌ను, స‌మాజం అసహ్యించుకునే వ్యాఖ్య‌ల‌ను చేస్తున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు.

చంద్ర‌బాబుని చూస్తే.. ఆయన నాలుగు ద‌శాబ్దాల కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నార‌ని, తమ పార్టీ నేత‌లు అశోక్ గ‌జ‌ప‌తి రాజు, తెలంగాణ‌లోని దేవేంద‌ర్ గౌడ్, కేఈ కృష్ణ‌మూర్తి ఎప్పుడైనా అటువంటి వ్యాఖ్య‌లు చేశారా? అని కాల్వ శ్రీనివాసులు ప్ర‌శ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Minister Kalva Srinivasulu told that the language using by YCP Chief and his party leaders is very nasty. While talking to press here in Vijayawada on Saturday Minister said that YCP Chief YS Jagan Mohan Reddy passed objectionable comments on AP CM Chandrababu Naidu. When election commission questioned him.. he changed his voice, told Kalva Srinivsulu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X