లక్ష్మీస్ ఎన్టీఆర్: లోకేష్-బాలకృష్ణపై రివేంజా? 'బాలకృష్ణ ఒత్తిడి చేసినా నో'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన మృతి వరకు తన సినిమాలో ఉంటాయని చెప్పారు.

ఆ విషయమే తెలియదా.. వైసిపితో ఒప్పందమా?: లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై మాటమార్చిన వర్మ

దీంతో అది మరింత చర్చకు దారి తీస్తోంది. పైగా ఈ సినిమాకు నిర్మాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి సహజంగానే టిడిపి నేతల్లో అనుమానాలు మొలకెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ ప్రకటన చర్చకు వస్తోంది.

బాలకృష్ణ ప్రకటన

బాలకృష్ణ ప్రకటన

తన తండ్రి ఎన్టీఆర్ పైన బయోపిక్ తీస్తానని నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తారని చెప్పారు.

అప్పుడే ప్రశ్నలు ఉత్పన్నం?

అప్పుడే ప్రశ్నలు ఉత్పన్నం?

ఎన్టీఆర్ బయోపిక్ తీస్తామని బాలకృష్ణ ప్రకటించినప్పుడే అందులో లక్ష్మీపార్వతి పాత్ర ఎలా ఉండబోతుంది? వైస్రాయ్ ఘటన ఉంటుందా, చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

వర్మ కాదని లోకేష్

వర్మ కాదని లోకేష్

అదే సమయంలో బాలకృష్ణ తీసే ఎన్టీఆర్ బయోపిక్‌కు రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా ఉంటారనే ప్రచారం జరిగింది. దీనిపై నారా లోకేష్ అప్పుడే ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు వర్మను తాము అనుకోలేదని, దర్శకుడు ఎవరైనా సరే బాలయ్య ఉంటే హిట్ అవుతుందని చెప్పారు.

బాలకృష్ణపై రివేంజా?

బాలకృష్ణపై రివేంజా?

అదే సమయంలో వర్మ తాను ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించారు. దీంతో బాలకృష్ణ, లోకేష్‌లపై రివేంజ్‌తో ఆ ప్రకటన చేసి ఉంటారని, తోడుగా వైసిపి ఆ తర్వాత జత కలిసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణపై రివేంజ్ అనేందుకు కారణం ఉంది!

బాలకృష్ణపై రివేంజ్ అనేందుకు కారణం ఉంది!

బాలకృష్ణపై రివేంజ్ అనడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. బాలకృష్ణ తీయాలనుకున్న బయోపిక్ కూడా మిమ్మల్ని తీయమంటే తీస్తారా అని విలేకరులు వర్మని అడిగారు. దానికి అతను తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే తీయాలనుకున్నానని, నా ఉద్దేశ్యంలో వాటి కన్నా తక్కువ ప్రాధాన్యం ఉంటే సినిమాగా తీయలేనని కుండబద్దలు కొట్టారు. బాలకృష్ణ ఒత్తిడి చేసినా కచ్చితంగా తీయనని, ఎన్టీఆర్ గురించి సినిమా తీస్తే ఇదొక్కటే అని స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ram Gopal Varma proposed film on legendary Telugu movie star and former Chief Minister N.T. Rama Rao, tentatively titled Lakshmi’s NTR, has already raised hackles.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి