స్టార్ క్యాంపేనర్లు: ‘నంద్యాల’ టీడీపీకి షాకిస్తుందా? జగన్‌ పార్టీకిది అవకాశమే!

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా? ఆ పార్టీ చేసిన చిన్న తప్పునకు భారీ మూల్యం చెల్లించనుందా? అంటే ఆ అవకాశాలే కనిపిస్తున్నాయి.

కర్నూలు: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా? ఆ పార్టీ చేసిన చిన్న తప్పునకు భారీ మూల్యం చెల్లించనుందా? అంటే ఆ అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా టీడీపీ చేసిన చిన్న తప్పే ఆ పార్టీ పాలిట శాపంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భూమా బ్రహ్మానందరెడ్డి ఖాతాలో వేస్తారా?

భూమా బ్రహ్మానందరెడ్డి ఖాతాలో వేస్తారా?

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫు ప్రచారం నిర్వహించిన స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చును అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఖర్చు కిందే ఈసీ లెక్కయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టీడీపీకి అనుకోని ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి.

నిబంధనల ప్రకారం..

నిబంధనల ప్రకారం..

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన స్టార్‌ క్యాంపెయినర్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, హాస్యనటుడు వేణు మాధవ్‌, రాష్ట్ర మంత్రులు అఖిలప్రియ, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

పేర్లు ముందే ఇవ్వాలి..

పేర్లు ముందే ఇవ్వాలి..

అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, అభ్యర్థి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్సివుంటుంది.

టీడీపీ చేసిన తప్పేంటంటే..

టీడీపీ చేసిన తప్పేంటంటే..

తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వారం రోజుల్లోగా తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను ఈసీకి అందించలేదు. నోటిఫికేషన్‌ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను టీడీపీ ఈసీకి పంపింది.

బ్రహ్మానందరెడ్డి ఖాతాలో పడితే అంతే..

బ్రహ్మానందరెడ్డి ఖాతాలో పడితే అంతే..

ఈ క్రమంలో ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటినట్లయితే.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.

ముందే మేలుకున్న వేసీపీ

ముందే మేలుకున్న వేసీపీ

అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. తమ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి తరఫు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను ఆగస్ట్‌ 2వ తేదీనే ఎన్నికల కమిషన్‌కి పంపింది. వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే రోజా, పలువురు పార్టీ నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+