ఎంతోమంది నన్నేదో చేయాలనుకున్నారు.. కానీ?, విజయసాయి దుర్మార్గానికి పరాకాష్ట : బాబు

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు భగ్గమంటున్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు అన్నాడని ఆరోపిస్తోంది. 'ఒక తల్లికి, ఒక తండ్రికీ పుట్టిన వాడైతే..' అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం అంటోంది.

Recommended Video

    విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట

    ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైతం అసెంబ్లీలో దీనిపై స్పందించారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ హుందాతనం తప్పలేదని గుర్తుచేశారు. ఎవరికైనా తల్లిదండ్రులు దేవుళ్లతో సమానమని, తన విషయంలోనూ అంతేనని చెప్పారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమన్నారు.

    IS THE INDIAN TRADITION IS TO BLAME THE PARENTS? chandrababu questioned vijayasai

    తల్లిదండ్రులను గౌరవించడం భారతీయ సంప్రదాయం కాదా? ప్రధాని కాళ్లకు మొక్కడమే భారతీయ సంప్రదాయమా? ఇటువంటి వాళ్లనా ప్రధాని కార్యాలయం చేరదీస్తోంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

    ఇప్పటిదాకా ఎంతోమంది తనను ఏదో చేయాలని చాలాసార్లు ప్రయత్నించారని, కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ అనే విలువలకు కట్టుబడి ఉండటమే దీనికి కారణమన్నారు.

    తన తల్లిదండ్రులు భౌతికంగా లేకపోయినప్పటికీ.. వారితో తనకు బలమైన అనుబంధం ఉంటుందన్నారు. అలాంటి వారిని అనరాని మాటలంటే ఆవేదన కలుగుతుందన్నారు. కేవలం ప్రజల కోసమే ఇన్ని విమర్శలు భరిస్తున్నానని తెలిపారు.

    మహిళలను, తల్లిని గౌరవించడం మన సంప్రదాయమని... మాతృమూర్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇటీవల అమ్మకు వందనం అనే కార్యక్రమం మొదలుపెట్టామని గుర్తుచేశారు. విజయసాయి తనపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ఆపై వారే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+