అఖిలప్రియ వెనుక రాజకీయ కుట్ర!?: ఎదుగుదలను ఓర్వలేకే!.. దెబ్బకొట్టడానికేనా!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజకీయాల్లో బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా పనిచేస్తుందో మంత్రి అఖిల ప్రియ చుట్టూ ముసురుకున్న పరిణామాలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వడి వడిగా అడుగులు వేస్తున్న ఆమెకు.. బహుశా ఇప్పటికే సీన్ మొత్తం అర్థమై పోయి ఉంటుంది.

భూమా నాగిరెడ్డికి ఉన్న పొలిటికల్ ఇమేజ్ అఖిలప్రియకు ఎంతగా లాభించిందో.. ఇప్పుడాయన లేకపోవడం కూడా ఆమెకు అంతే లోటుగా పరిణమించింది. వెనకాల అండగా నిలబడే పెద్ద దిక్కు లేకపోవడంతో.. అఖిలప్రియపై ముప్పేట దాడి మొదలైనట్లుగా కనిపిస్తోంది.

నిన్న మొన్నటి దాకా కిక్కురుమనని గొంతులు కూడా ఇప్పుడామెపై పెడ ధోరణి వినిపిస్తున్నాయంటే.. ఇది సహజ పరిణామమా? లేక ఆమె వెనకాల కుట్రేమైనా జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Akhila Priya

తల్లిదండ్రుల సెంటిమెంట్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అఖిలప్రియ.. మంత్రిగా జిల్లాలో గట్టి పట్టును ఏర్పరుచుకుంటోంది. ఒంటరిగానే తన రాజకీయాలకు పదును పెట్టుకుంటూ ముందుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏకపక్ష పోకడలంటూ ఆమెకు సొంతగూటి నుంచే విమర్శలు రావడం.. తనకు వైసీపీ ఆఫర్ ఉందంటూ ఏవీ సుబ్బారెడ్డి పరోక్షంగా బెదిరింపులకు దిగడం అఖిలప్రియకు తీవ్ర ప్రతికూలతలను తెచ్చిపెట్టాయి.

నంద్యాలపై మలుపు, అఖిలప్రియకు బాబు షాక్: తెరపైకి ఎస్పీవై రెడ్డి

నంద్యాల ఉపఎన్నిక టికెట్ విషయంలో శిల్పా మోహన్ రెడ్డితో మొదలైన పేచీ.. ఆ తర్వాత పార్టీలో లుకలుకలకు తావిచ్చేలా మారింది. అయితే ఇదంతా అఖిలప్రియ పట్టును దెబ్బతీయడానికేనా? అన్న అనుమానాలు తెర పైకి వస్తుండటంతో.. టీడీపీలో ఆమె భవిష్యత్తు రాజకీయాలు మున్ముందు మరింత జటిలం కానున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవిధంగా అఖిలప్రియ ఎదుగుదల కొంతమందికి కంటగింపుగా మారడం వల్లే ఇప్పుడామెకి ఈ పరిస్థితి తలెత్తిందనేది నంద్యాల రాజకీయాల్లో వినిపిస్తోన్న మాట.

మొత్తానికి నిన్నటి దాకా సాఫీగా సాగిన అఖిలప్రియ పొలిటికల్ జర్నీ.. ఇకనుంచి ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సిన అనివార్యతను కల్పించింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అఖిలప్రియ ప్రదర్శించే నేర్పు మీదనే ఆమె భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The rumours spreading on Minister Bhuma Akhila Priya politics in Kurnool district. Especially is there any political conspiracy behind Akhila Priya
Please Wait while comments are loading...