దళిత సిఎం: డైలమాలో జి వివేక్, కెసిఆర్‌కు షాకిస్తారా?

తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడానికి ముందే మరో ఎంపి మందా జగన్నాథం, సీనియర్ నేత కె కేశవ రావుతో కలిసి వివేక్, ఆయన వినోద్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ జాప్యం చేయడమే తాము తెరాసలో చేరడానికి కారణమని వారు అప్పట్లో చెప్పినా.. అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకతతోపాటు ఇతరత్రా అంశాలు కూడా కారణమనే చర్చ అప్పట్లో పార్టీలో జరిగింది.
తాజా పరిస్థితుల్లో తెరాస అధినాయకత్వం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తూ ఎంపీ వివేక్‌కు సిటింగ్ స్థానమైన పెద్దపల్లిని కేటాయించటానికి సిద్ధమైంది. వినోద్‌కు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణ రాష్ట్రానికి తొలి సిఎం దళితుడే అనే నిర్ణయం నుంచి తెరాస వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండటం, కాంగ్రెస్‌తో పొత్తుకు నిరాకరిస్తుండటంపై వారు కొంత అసంతృప్తిగా ఉన్నారట.
మరోవైపు, బెల్లంపల్లి సీటును కాకుండా, అదే ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ సీటును వినోద్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ తెరాస నుంచి నల్లాల ఓదెలు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని చెన్నూరులో వినోద్‌కు టికెట్ ఇవ్వటం తెరాస అధిష్టానంకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో పోటీకి వినోద్ విముఖత చూపటానికి కారణం.. అక్కడ సిపిఐ సిటింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తిరిగి పోటీ చేస్తుండటమేనని అంటున్నారు.
కాంగ్రెస్‌తో తెరాస పొత్తు ముగిసిన అధ్యాయమని కెసిఆర్ స్వయంగా ప్రకటించడంతోపాటు కాంగ్రెస్, సిపిఐ జట్టు కట్టే సూచనలు కూడా బెల్లంపల్లి సీటును వినోద్ వద్దటానికి మరో కారణమని చెబుతున్నారు. బెల్లంపల్లి కాకపోతే కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సీటును వినోద్‌కు కేటాయించటానికి తెరాస నాయకత్వం సిద్ధంగా ఉందట. అయినా ఆయన చెన్నూరు కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications